ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని.. మతసామరస్యం పాటించాలని చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. తిరుమల లడ్డూ ప్రసంగంలో కల్తీ నెయ్యి వినియోగంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఫ్యాక్షనిజంపై కూడా వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే.. పోస్టుమార్టంకు కారణమైన వారు.. పోస్టుమార్టంకు గురవుతారని బలంగా తాను నమ్ముతా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే రాయలసీమలో ఫ్యాక్షనిజం రూపు మాపేందుకు 1995లోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Also Read : నికోటిన్ గమ్ లు వాడుకోవచ్చా..?
ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. 30 – 4 కిలోమీటర్ల దూరానికి కూడా బలప్రదర్శనతో 6-7 గంటలు చేస్తూ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లలేకపోయారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా పేరుతో కొందరు హింసను ప్రోత్సహిస్తున్నారన్నారు. పుట్టిన రోజు పేరుతో జంతు బలులు చేసి.. రక్తాభిషేకం చేసే వారికి అండగా ఉంటారా అని నిలదీశారు.
తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాపై మరోసారి అసెంబ్లీలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి విషయంపై దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నివేదిక ఇచ్చాయన్నారు. కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ధార్మిక సంఘాలు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వేంకటేశ్వర స్వామి లడ్డూను అపవిత్రం చేశారన్నారు. ఇది తెలియక చేసిన తప్పు కాదని.. కుట్రతోనే కావాలనే చేశారన్నారు. ఏడుకొండలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు కొండలు చెప్పినప్పుడే తప్పు చేస్తున్నారని చెప్పానన్నారు.
Also Read : మరో దేశంపై ట్రంప్ గురి.. యుద్ధంపై సంచలన కామెంట్స్..!
ఏసు ప్రభువుకు సంబంధించిన వార్తను వైసీపీ సొంత పత్రిక సాక్షిలో ప్రచురించారు. అందులో ఏసు ప్రభువుకు అన్యాయం జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో.. జగన్ స్వయంగా తన సొంత పత్రికలో తన పేరుతోనే క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా క్షమాపణ చెప్పాలన్నారు. తాను చేసిన సరే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంను అపవిత్రం చేసి సమాధానం ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదా అని ప్రశ్నించారు. ప్రభువా క్షమించు అని సాక్షిలో బహిరంగ ప్రకటన విడుదల చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. స్వామి ప్రసాదం అపవిత్రం చేసి.. కనీసం స్పందించటం లేదన్నారు. నమ్మకం లేకపోతే తిరుమల సహా హిందూ ఆలయాలకు వెళ్లొద్దన్నారు. నమ్మకం ఉండే వెళ్తారన్నారు. మత సామరస్యాన్ని గౌరవించాలని.. అందుకే చర్చికి వెళ్లినప్పుడు అక్కడుండే మత పెద్దలు చెప్పినట్లు తాను చేస్తా అన్నారు. సాంప్రదాయాలు గౌరవించాలన్నారు.

