Friday, November 27, 2026 11:16 AM
Friday, November 27, 2026 11:16 AM

కేంద్రం డీలిమిటేషన్ సాహసం.. నంబర్ల వెనుక అసలు రాజకీయం..?

దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఇందులో భాగంగా నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశం కానుండగా, డిసెంబర్ 3న ఉభయ సభలు ముగియనున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో అత్యంత కీలకమైన సవరించిన ‘డీలిమిటేషన్ బిల్లు’ను ప్రవేశపెట్టేందుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా 50 శాతం లోక్‌సభ సీట్లను పెంచడం, అలాగే రానున్న 25 ఏళ్ల పాటు రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో ఎలాంటి మార్పు లేకుండా 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఫ్రీజ్ చేయడం ఈ కొత్త బిల్లులోని ప్రధాన ప్రతిపాదనలుగా తెలుస్తోంది.

Also Read : వైసీపీలో ప్రక్షాళన కలవరం..!

అయితే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ తప్పనిసరి. గత ఏప్రిల్‌లో ఇదే బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాల ఐక్యత ముందు ఎన్డీయే సర్కార్‌కు బలం సరిపోక బిల్లు వీగిపోయింది. మరి సొంతంగా మూడింట రెండొంతుల బలం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంత ధైర్యంగా ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లును మళ్లీ ఎందుకు ముందుకు తెచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని నెలలుగా పార్లమెంట్‌లో మారిన రాజకీయ సమీకరణాలే కేంద్రం ఈ సాహసం చేయడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు చీలిపోయి ఎన్డీయేకు మద్దతు ప్రకటించడం, శివసేన (ఉద్ధవ్ వర్గం) నుంచి ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరడం, శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంతో పాటు ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (4 ఎంపీలు) కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండటంతో ఎన్డీయే బలం 353 స్థానాలకు చేరుకుందని అంచనా.

Also Read : భారత మార్కెట్లోకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ హైబ్రిడ్ కారు..!

ఇక దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను చల్లార్చేందుకు అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచుతూ కేంద్రం వేసిన ఎత్తుగడ కూడా ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టింది. మరోవైపు, ‘ఆపరేషన్ లోటస్’ ద్వారా ఇతర పార్టీల ఎంపీలను చీల్చి దొడ్డిదారిన బిల్లును నెగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై చర్చించేందుకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ రచన బృందం శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. మరి మెజారిటీకి కేవలం ఏడు ఓట్ల దూరంలో ఉన్న ఎన్డీయే సర్కార్, విపక్షాల వ్యూహాలను దాటుకుని ఈ చారిత్రాత్మక బిల్లును గట్టెక్కిస్తుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గన్నవరంలో టీడీపీకి దిమ్మ...

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయం...

పవన్ మాస్టర్ స్ట్రోక్.....

గ్రామీణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర...

సొంత జిల్లాలో జగన్...

కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం...

ప్రకాశం జిల్లాలో సంచలనం.....

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు...

తిరుమల శ్రీవారికి కనీవినీ...

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర...

జగన్ కంటే ముందే...

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

పోల్స్