Thursday, May 7, 2026 03:44 AM
Thursday, May 7, 2026 03:44 AM

ఏపీ మంత్రుల ‘గ్రౌండ్’ వర్క్ స్టార్ట్..?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి లేదంటే కొంతమంది మంత్రుల పనితీరు పక్కన పెడితే.. మెజారిటీ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు తక్కువ. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కొంతమంది మంత్రుల వ్యవహారం కూడా అలాగే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు పెద్దగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే వారు కాదు. క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా మంత్రులు దూరంగానే ఉండేవారు.

Also Read : టీ కాంగ్రెస్ లో ఎంపీ గారి డామినేషన్ వేరే లెవల్

ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన సందర్భాల్లో కూడా పెద్దగా వారు మాట్లాడిన సంఘటనలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్చార్జిగా ఉన్న జిల్లాలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు పలు పర్యటనలకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పెద్ద ఎత్తున మంత్రుల పర్యటనలు మొదలుకానున్నాయి. తమ తమ శాఖలపై పట్టుపెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు మంత్రులకు అవకాశం ఇచ్చారు.

Also Read : విశాఖ మేయర్ ఎన్నిక.. జగన్‌కు బూమ్‌రాంగ్..!

ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. కేవలం నియోజకవర్గాలు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా మంత్రులు ఇమేజ్ పెంచుకోవాలని సూచించారట సీఎం. దీనితో అన్ని శాఖల మంత్రులు తమ శాఖలకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయనున్నారు. అలాగే నేరుగా ప్రజలను, క్షేత్రస్థాయి నాయకులను కలిసి వారికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి పనులు, అలాగే వారి వారి శాఖల్లో జరుగుతున్నటువంటి మార్పులు, అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పథకాలు, అలాగే విపక్షాలు చేస్తున్న విమర్శలకు వివరణలు, వీటన్నింటినీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు నలుగురు మంత్రులు తమ పర్యటనలకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్