Wednesday, May 6, 2026 08:58 PM
Wednesday, May 6, 2026 08:58 PM

వెయిటింగ్ లో ఉన్న ఐపిఎస్ అధికారులకు డిజిపి షాక్

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్ళ పాటు రెచ్చిపోయిన కొందరు ఐపిఎస్ అధికారులపై చంద్రబాబు సర్కార్ తాజాగా దృష్టి పెట్టింది. ఇంకా వారికి పోస్టింగ్ లు ఇవ్వని సర్కార్, ఎప్పటిలోగా ఇస్తుంది అనే స్పష్టత కూడా లేదు. కొందరు ఐపిఎస్ అధికారులపై కేసులు కూడా నమోదు చేసారు. దాదాపు 16 మంది ఐపిఎస్ అధికారులకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు సర్కార్. ఇక పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా సర్కార్ ఇచ్చే అవకాశం కనపడటం లేదు. అవసరమైతే డిప్యుటేషన్ పై కొత్త అధికారులను రాష్ట్రానికి తీసుకొస్తుంది.

తాజాగా ఒక అధికారిని తీసుకొచ్చి డ్రగ్స్ ని అంతం చేసే బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలో ఒక గట్టి షాక్ ఇచ్చింది సర్కార్. వెయిటింగులో ఉన్న ఐపీఎస్ అధికారులు ప్రతీ రోజు డీజీపీ ఆఫీసుకు వచ్చి వెయిట్ చేయాల్సిందే అని స్పష్టం చేసింది. హెడ్ క్వార్టర్సులో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్సులకు మెమో జారీ చేసారు డీజీపీ. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే, రిజిస్టర్ లో సంతకం చేసి… ఆఫీసులో వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయాలని ఆదేశించారు.

Also Read : కొడాలి నాని కి రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేసిన టిడిపి

వేయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అలాగే ముగ్గురు ఐజి లు, డీఐజీలు పలువురు ఎస్పీలు ఉన్నారు. వెయిటింగులో ఉన్న సీనియర్ ఐపీఎస్ లు ఎవరంటే…

డీజీపీ స్థాయి అధికారులు; పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్,

అదనపు డీజీ సంజయ్

ఐజిలు కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి,

డీఐజీ లు అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని.

వెయిటింగులో ఉన్న ఎస్పీ స్థాయి ఐపీఎస్ లు: రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, పాలరాజు, అన్బ్ రాజన్ వీరు అందరూ ప్రతీ రోజు వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్