Monday, April 27, 2026 10:05 AM
Monday, April 27, 2026 10:05 AM

టీడీపీలోకి మరో వారసురాలు..?

తెలుగు రాజకీయాల్లో వారసులు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ అన్ని పార్టీల్లోని సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రుల వారసులు ప్రజా ప్రతినిధులుగా కూడా ఉన్నారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎర్రన్నాయుడు వారసుడు 3 సార్లు ఎంపీగా గెలిచారు. రాబోయే ఎన్నికల్లో ధర్మాన, తమ్మినేని, పేర్ని, చెవిరెడ్డి, మాగుంట, చింతకాయల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Also Read : ఆ జిల్లా సంగతి నేను చూస్తా.. చంద్రబాబు కీలక కామెంట్స్

ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా బెజవాడ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రంగా.. 41 ఏళ్ల వయసులో 1988 డిసెంబర్ 26న హత్యకు గురయ్యారు. ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి రంగా భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రంగా కుమారుడు రాధా కృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీలో చేరిన రాధా కృష్ణ.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.

ఇక తాజాగా రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి రంగా ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరుతారనే చర్చ బెజవాడ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అన్న టీడీపీలో ఉన్నాడు.. కాబట్టి.. ఆశా కిరణ్ కూడా టీడీపీలో చేరుతారా.. లేక కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ సారధ్యంలోని జనసేనలో చేరుతారా.. లేక జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారా అనే చర్చ జోరుగా నడుస్తోంది. దీనిపై ఇప్పటికే విజయవాడలో బెట్టింగులు కూడా జోరుగా నడుస్తున్నాయి. అయితే పుకార్లకు మరింత బలం ఇచ్చేలా ఆశా కిరణ్ ఇటీవల టీడీపీ సీనియర్ నేతలను వరుసగా కలుస్తున్నారు.

Also Read : ఎన్డియే వ్యూహంతో బిజెపిని మమత దెబ్బ కొడతారా..?

తాజాగా మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్‌తో ఆశా కిరణ్ భేటీ అయ్యారు. రేపల్లే వెళ్లిన సమయంలో నేరుగా అనగాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ శివ ప్రసాద్‌తో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. తన కార్యాలయానికి వచ్చిన ఆశా కిరణ్‌ను శివ ప్రసాద్ స్వయంగా లోపలికి ఆహ్వానించారు కూడా. వీరిద్దరి మధ్య రాజకీయ పరమైన అంశాలే చర్చకు వచ్చినట్లు సన్నిహితులు వెల్లడించారు. దీంతో ఆశా కిరణ్ త్వరలోనే టీడీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. మరి తన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆశా కిరణ్ స్వయంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కవిత టీఆర్ఎస్‌.. ఏపీలో...

నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు...

అయ్యా వడ్డే గారు.....

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీరును...

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో...

జగన్ మెప్పు కోసం...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి...

కల్తీ నెయ్యి కేసు.....

కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ అధికారులు...

పోల్స్