తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్లో భూకంపం.. ఇప్పుడు ఈ మాటే టాలీవుడ్లో బాగా వినిపిస్తోంది. తెలుగు చలనచిత్ర పంపిణీ రంగంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న కొద్దిమంది గుత్తాధిపత్యానికి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ లాభదాయకమైన మార్కెట్లో వాటాను దక్కించుకోవడానికి కొత్త వారు రంగంలోకి దిగుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ విభాగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రవేశపెట్టింది. నటుడు అక్కినేని నాగార్జున నేతృత్వంలోని అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పంపిణీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా, త్వరలో విశాఖపట్నంలో మరో కార్యాలయాన్ని ప్రారంభించనుంది.
Also Read : లోకేష్ డిన్నర్ మీట్.. మంత్రి గారి కొత్త సాంప్రదాయం..!
నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి వంటి ప్రముఖ నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ఒక కూటమిగా ఏర్పడి, సినిమాలు నిర్మించడంతో పాటు పంపిణీ కూడా చేయాలని భావిస్తున్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ రాక పై పాత వారు తమదైన శైలిలో స్పందించారు. ఈ పరిణామాల వల్ల ఇది తమకేమీ ముప్పు కాదని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంపిణీకి ప్రత్యేక లైసెన్స్ అవసరం లేదని, ఎవరైనా కార్యాలయం తెరుచుకోవచ్చని, గతంలో కూడా చాలామంది వచ్చి వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతమున్న పంపిణీదారుల తీరుపై కొంతమంది నిర్మాతలు చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. రోజువారీ కలెక్షన్ రిపోర్ట్స్ సరిగ్గా పంచుకోవడం లేదని, పేమెంట్లలో జాప్యం జరుగుతోందని, అందుకే కొత్త కూటమి వైపు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారని సమాచారం. పంపిణీదారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని నిర్మాతలు వాపోతున్నారు. ఒక సినిమా 30 కోట్లకు అమ్ముడైతే, కేవలం 22 కోట్లు మాత్రమే వస్తున్నాయని, మిగిలిన మొత్తాన్ని అడగవద్దని పంపిణీదారులు కోరుతున్నారని ఒక నిర్మాత తెలిపారు.
Also Read : స్టూడెంట్ వీసాలపై కేంద్రం కీలక ప్రకటన..!
నిజానికి టాలీవుడ్లో ఎప్పటి నుంచో గుత్తాధిపత్యం కొనసాగుతోంది. సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, సునీల్ నారంగ్ వంటి ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లపై పట్టు కలిగి ఉన్నారు. వాళ్లు చెప్పినట్లే రిలీజ్ డేట్లు కూడా ఉండాలనేది టాలీవుడ్లో వినిపిస్తున్న మాట. అయితే ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ వంటి కొత్త నిర్మాణ సంస్థలు పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. వీళ్లు సుమారు 60 థియేటర్లతో తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ పాత గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు.
అమెరికాలోని ‘Rentrak’ మాదిరిగా రియల్ టైమ్ బాక్సాఫీస్ డేటా అందుబాటులోకి వస్తే పారదర్శకత పెరుగుతుందని, అలాగే పంపిణీదారులు వారానికోసారి పేమెంట్లు సెటిల్ చేయాలని నిర్మాతలు కోరుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల కానున్న టాక్సిక్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్.. పెద్ది వంటి భారీ చిత్రాల పంపిణీ విషయంలో మార్కెట్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది.

