Sunday, March 22, 2026 10:26 AM
Sunday, March 22, 2026 10:26 AM

టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై అప్పుడే..? విరాట్ సంచలన నిర్ణయం..?

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యాడా…? అంటే అవును అనే సమాధానం వినపడుతోంది. గత కొంతకాలంగా ఫామ్ లో లేక నానా ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా తన పూర్ ఫాంని కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా మైదానాలు విరాట్ కోహ్లీకి కొట్టిన పిండైనా పరుగులు చేయడానికి నానా అవస్తులు పడుతున్నాడు. మొదటి టెస్ట్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ రెండో టెస్టు మూడో టెస్ట్ లో ఘోరంగా విఫలమయ్యాడు.

ఒక పక్కన యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంటే విరాట్ కోహ్లీ మాత్రం క్రీజ్ లో నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కీలక సమయంలో కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ లు ఆశిస్తున్న అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. దీనితో అటు కోహ్లీ కూడా ఒత్తిడి లోనే ఉన్నాడు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఇంకా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ రెండు టెస్టుల తర్వాత కోహ్లీ ఖచ్చితంగా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు టెస్టుల తర్వాత మళ్లీ వచ్చే ఏడాది జూన్ వరకు టెస్టులు లేవు.

Also Read : ఆస్ట్రేలియాకు మొగుడు అయ్యాడు.. మెంటల్ ఎక్కిస్తున్న బూమ్రా

ఇంగ్లాండ్ తో సిరీస్ వచ్చేయడాది జూన్ లో మొదలకానుంది. ఈ లోపు చాంపియన్ ట్రోఫీ అలాగే ఐపీఎల్ ఉన్నాయి. అయితే వైట్ బాల్ క్రికెట్ లో కంటిన్యూ అయి రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉండవచ్చునే అభిప్రాయాలు వినపడుతున్నాయి. విరాట్ కోహ్లీ వన్డే లు కూడా తక్కువగానే ఆడుతున్నాడు. వచ్చే ఏడాది కూడా వన్డేల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే ఉన్న నేపథ్యంలో కోహ్లీ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అటు జట్టు యాజమాన్యం కూడా కోహ్లీ ప్రదర్శన పై కాస్త సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్