Sunday, June 21, 2026 04:50 AM
Sunday, June 21, 2026 04:50 AM

బాలయ్య విత్ పూరీ… కాంబో రిపీట్…?

ఏడు పదుల వయసు దగ్గర పడుతున్న సరే… నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమాలు చేసే విషయంలో ఎక్కడా వెనుకడు వేయడం లేదు. బాలకృష్ణ గతంలో కంటే ఇప్పుడు మరింత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉంటే మరో సినిమా కూడా లైన్ చేస్తున్నారు. దానికి తోడు తన కొడుకు సినిమాలో కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక తన కొడుకుని డైరెక్టు చేయాలనే ప్రయత్నాలు కూడా బాలకృష్ణ చేస్తున్నారు.

ఈ తరుణంలో బాలకృష్ణ మరోసారి పూరీ జగన్నాద్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ సినిమా చేయడానికి బాలకృష్ణ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పూరి వద్ద కథ సిద్ధంగా లేకపోవడంతో బాలయ్య సినిమా ఆలస్యం అవుతూ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే గతంలో కంటే భిన్నంగా ఈ కథను పూరి రెడీ చేసుకుని పెట్టుకున్నారట.

Also Read : అశ్విన్‌ సడన్‌ రిటైర్‌మెంట్‌ కారణాలివేనా..?

కచ్చితంగా బాలకృష్ణతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని పూరి పట్టుదలగా ఉండటంతో బాలకృష్ణ కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది పైసా వసూల్ సీక్వెల్ అని కొంతమంది అంటుంటే కాదు కొత్త కథ అని మరికొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా వచ్చేయడాది మాత్రం కచ్చితంగా ఈ సినిమాను లాంచ్ చేయాలని పూరీ జగన్నాథ్, బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ దీనికి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పూరి జగన్నాథ్ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో భేటీ కూడా అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్