Sunday, June 21, 2026 06:00 AM
Sunday, June 21, 2026 06:00 AM

ఆస్ట్రేలియాకు మొగుడు అయ్యాడు.. మెంటల్ ఎక్కిస్తున్న బూమ్రా

ఆస్ట్రేలియా జట్టుకు వారి స్వదేశంలో తిరుగు లేదు. భీకర బౌలింగ్ లైనప్ తో, దుర్భేధ్యమైన బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యం కొనసాగించడం ఖాయం అనేది అందరి అభిప్రాయం. కానీ ఒక్క ఆటగాడు ఆ జట్టు వ్యూహాలను తిప్పి కొడుతున్నాడు. స్వేచ్చగా ఆడే ఆసిస్ జట్టుకు చెమటలు పట్టిస్తున్నాడు. అతనే జస్ప్రిత్ బూమ్రా. ఆస్ట్రేలియా జట్టుకు సింహ స్వప్నం అయ్యాడు ఈ బౌలర్. 30 ఏళ్ళ బూమ్రా బంతులు విసురుతుంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కు మైండ్ చెడిపోతుంది. ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పటివరకు ఈ సీరీస్ లో అతను 21 వికెట్లు తీసాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. 53 వికెట్లు తీసాడు ఆస్ట్రేలియా గడ్డపై. కపిల్ దేవ్… 51 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. పెర్త్‌ లో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించడంలో అతను కీ రోల్ ప్లే చేసాడు. ఆ టెస్ట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతను సిరీస్‌లో ఇప్పటివరకు 10.90 సగటుతో 21 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

Also Read : అర్షదీప్ ను పిలవండి… మెల్బోర్న్ లో ఈ మార్పులు చేయాల్సిందే

ఆ తర్వాత మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ చెరో 14 వికెట్లు తీసారు. రాబోయే రెండు టెస్ట్ లు ఆస్ట్రేలియాకు కీలకం. భారత్ ను ఎదుర్కోవడం కంటే బూమ్రాను ఎదుర్కోవడమే వారికి పెద్ద సవాల్ గా మారింది. బ్యాటింగ్ లో కూడా బూమ్రా మూడో టెస్ట్ లో మెరుగ్గా రాణించాడు. చివరి వికెట్ గా బ్యాటింగ్ కు వచ్చిన బూమ్రా… పది విలువైన పరుగులు చేసాడు. దీనితో ఆస్ట్రేలియా ఆటగాళ్ళు బూమ్రాను ఎదుర్కోవడానికి తమ సీనియర్ల సలహాలు తీసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్