Saturday, September 19, 2026 10:16 AM
Saturday, September 19, 2026 10:16 AM

కుప్పం బాధ్యత నాది.. ఆకట్టుకున్న భువనేశ్వరి ప్రసంగం

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని… కాబట్టి పట్టుదలగా అందరూ కష్టపడి చదువుకోవాలని సూచించారు ఆమె. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని, మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు. విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయన్నారు.

నేను మీలాగే సరదాగా గడిపానని… కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటూ ఉండగా 19 ఏళ్లకే పెళ్లి చేశారని… నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు గారు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారని ఒక చాలెంజ్ గా తీసుకుని పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆటపాటలే కాదు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని… విజయం ఊరికే ఏమీ రాదు..కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదన్నారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉన్నత స్థానాలకు మనం చేరుకోగలమని పిలుపునిచ్చారు.

Also Read : ఫైబర్ నెట్ లో దారుణాలు.. జీవీ రెడ్డి సంచలన కామెంట్స్

కుప్పం అభివృద్ధి గురించి మాట్లాడిన ఆమె… చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారన్నారు. ప్రజలకు సేవ చేయాలని తపిస్తారని… ఇప్పుడు స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళుతున్నారని కొనియాడారు. పేదరికం లేని సమాజమే ఆయన లక్ష్యమన్నారు. చంద్రబాబు గారిని సొంత బిడ్డగా భావిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేమని… రాబోయే ఐదేళ్లలో కుప్పం ను అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నానన్నారు. కుప్పం అభివృద్ధి బాధ్యత తనదని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్