Saturday, September 19, 2026 07:04 AM
Saturday, September 19, 2026 07:04 AM

సిఐడి మాజీ డిజి పివి సునీల్ కుమార్ అరెస్ట్ కి రంగం సిద్ధం..!

గత ప్రభుత్వంలో హద్దు అదుపు లేకుండా చెలరేగిపోయిన ఐపిఎస్ అధికారులకు ఒక్కొక్కరికి కూటమి సర్కార్ ఉచ్చు బిగిస్తోంది. సాధారణంగా ఐపిఎస్ అధికారులు రాజకీయ నాయకులతో గోక్కునే సాహసం చేయరు. ఒకవేళ చేసిన ఎమ్మెల్యేలు లేదంటే నియోజకవర్గాల ఇంచార్జ్ లు లేదంటే రౌడీ ఇమేజ్ ఉన్న నాయకులతోనే. కానీ గత ప్రభుత్వంలో ఐపిఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అసలు టీడీపీ నాయకత్వం మొత్తంతో వివాదాలకు గొడవలకు వెళ్ళారు. అయితే చంద్రబాబు ని అరెస్ట్ చేయాలన్న వైసీపీ పెద్దల ఆదేశాలను వ్యతిరేకించినందుకు ఆయన్ను పదవి నుంచి తొలగించారన్న వ్యాఖ్యలు కూడా అప్పటిలో వినిపించాయి.

అయితే టిడిపి సోషల్ మీడియా కార్యకర్తల పై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మొదలుపెట్టడంతో టీడీపీ సోషల్ మీడియా మొత్తాన్ని ఆయన భయపెట్టిన పరిస్థితి ఉంది అప్పట్లో. చాలా మంది నాయకులు కూడా భయపడ్డారు. ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజుని ఆయన ట్రీట్ చేసిన విధానంపై అప్పట్లో పెద్ద వివాదమే ఉంది. ఇక అది నిదానంగా ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు జత్వాని కేసుతో సీరియస్ గా ఉన్న పోలీసులు… ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ విషయంలో కూడా అడుగులు వేయడం మొదలుపెట్టారు. డిజి ర్యాంక్ ఐపీఎస్‌ అధికారిగా ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది సాధారణ పరిపాలనశాఖ.

Also Read : అన్న వింటున్నాడు గురూ.. జాగ్రత్తగా ఉండండి.. వైసీపీ నేతల్లో కొత్త భయం

అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ప్రకారం వాటిని ఉల్లంఘించినందుకు ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలను తీసుకుంటూ జీవో ఆర్‌టి నెం 1695 జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వెబ్‌సైట్ లో ఈ ఉత్తర్వులను కాన్ఫిడెన్షియల్ క్రింద అప్‌లోడ్ చేసారు. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్‌ కుమార్‌ పై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయగా చర్యలకు దిగింది సర్కార్. మరి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లపై కూడా కఠిన చర్యలకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. కొందరిని అరెస్ట్ కూడా చేయనున్నారు అని తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్