Tuesday, October 28, 2025 05:15 AM
Tuesday, October 28, 2025 05:15 AM
roots

చెమటలు పట్టిస్తున్న ఎల్లో మీడియా…?

టైటిల్ చదవగానే ఆ చెమటలు కక్కేది వైసీపీ నేతలు అనుకుని ఉంటారు కదా…? అలా అనుకుంటే ఇసుకలో కాలేసినట్టే. అవును ఇసుకలో, లిక్కర్ లో ఇలా చాలా పదార్ధాలలో కాలు వేసినట్టే. గత వారం రోజుల నుంచి వార్తలు చూస్తున్న జనాలకు ఓ అవగాహన వచ్చే ఉంటది. అవును.. ఇప్పుడు ఎల్లో మీడియా దెబ్బకు చెమటలు కక్కుతున్నారు టీడీపీ నేతలు. మరి చంద్రబాబు సూచనలో లేక మరో కారణమో తెలియదు గాని గతంలో వైసీపీ ఎమ్మెల్యేల కంటే దారుణంగా ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలను ఎల్లో మీడియా వేటాడుతుంది.

మొన్నా మధ్య ఓ ప్రముఖ ఛానల్ లో ఇసుక విషయంలో… శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి వ్యవహార శైలిని టార్గెట్ చేస్తూ కథనం వచ్చింది. ఆయన ఏకంగా ఆ ఛానల్ విలేఖరిని బెదిరించడం సంచలనం అయింది అప్పట్లో. మా విలేఖరినే బెదిరిస్తావా అంటూ కథనం ప్రచురించింది సదరు ఛానల్. ఇక మద్యం వ్యాపారాల విషయంలో వ్యాపారులను, టెండర్ వేసే వాళ్ళను బెదిరిస్తున్నారు అంటూ రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యేలపై కథనం వచ్చింది. ఈ కథనం చంద్రబాబు వద్దకు కూడా వెళ్ళింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అందులో పేర్కొన్నారు.

Read Also : సాయన్న సాయం ఏది…? ఢిల్లీ ఎందుకు పోవట్లేదు రెడ్డి గారూ…

అంతే మాకేం వద్దులే మీ క్వార్టర్… మీరే తాగండి మీరే ఉంచుకోండి అంటూ ఎమ్మెల్యేలు దెబ్బకు సైడ్ అయిపోయారు. ఇక ఇసుక అక్రమాల విషయంలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేసేస్తోంది ఎల్లో మీడియా. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావోద్దనే తపనో… వైసీపీకి అవకాశం ఇవ్వొద్దు అనే భావనో గాని… అసలు వదలడం లేదు. విలేఖర్లు అందరూ అదే పని మీద ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. ఇసుకపై ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కెలకవద్దు అని పరోక్షంగా హెచ్చరిస్తోంది ఎల్లో మీడియా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్