Wednesday, August 5, 2026 04:37 PM
Wednesday, August 5, 2026 04:37 PM

ఐపిఎస్ కు గురి పెట్టిన బాబు సర్కార్… సునీల్ కుమార్ కు సెట్ చేసారా…?

ఏ మాటకు ఆ మాట గాని… అప్పట్లో టీడీపీ నేతలు గాని కార్యకర్తలుగాని జగన్ కంటే ఎక్కువ భయపడింది ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ కే. సిఐడీ చీఫ్ గా నేతలను, కార్యకర్తలను వెంటాడి వేటాడి జైల్లో కూర్చోబెట్టారు. దళితుడు కాబట్టి సోషల్ మీడియాలో కూడా చాలా వరకు మాట్లాడే సాహసం ఎవరూ చేయలేదు అప్పట్లో. కాని సారు చేసిన పాపాల లిస్టు చాలా పెద్దదే అంటారు ఆయన బాధితులు. సాక్షాత్తు ఒక ఎంపీ గారిని కూడా వేధించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆఫీసర్ గారికి గడ్డు కాలం నడుస్తోంది.

అయితే ఆయనపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, ఆయన పేరు రెడ్ బుక్ లో లేదా అంటూ చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే ఆయనపై చర్యల్లో కీలక అడుగు పడింది. సీఐడీ మాజీ డీజీగా వ్యవహరించిన ఆయనపై… అభియోగాలు నమోదు అయ్యాయి. సోషల్ మీడియా లో సునీల్ చేసిన వ్యాఖ్యలపై ప్రవర్తన నియమావళికి భిన్నంగా ఉన్నట్టు అభియోగ పత్రంలో ప్రభుత్వం పేర్కొంది. రఘురమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు.

Read Also : బరితెగించిన దువ్వాడ…!

ఈ ఏడాది జూలై 12 న సోషల్ మీడియా ద్వారా సునీల్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు చేసారు. సునీల్ పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బదిలీ చేసి వెయిటింగ్ లో ఉంచిన ప్రభుత్వం… 15 రోజుల్లోపు అభియోగాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆయనను విజయవాడ దాటి వెళ్ళవద్దు అనే ఆదేశాలు కూడా ఇచ్చింది గతంలో. డీజీపీ ఆఫీస్ లో రోజు సంతకం చేయమని కూడా చెప్పింది. మరి ఆయన ఏం సమాధానం ఇస్తారో చర్యలు ఏముంటాయో చూడాలి. అప్పట్లో చేసిన కార్యక్రమాలపై చర్యలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి టీడీపీ క్యాడర్ లో ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్