Saturday, September 19, 2026 11:33 AM
Saturday, September 19, 2026 11:33 AM

వెలుగులోకి సంచలన విషయాలు.. జోగి రమేష్ కి శుభం కార్డు పడినట్లేనా?

అగ్రీ గోల్డ్ భూముల వ్యవహారంలో ఇప్పుడు ఏపీ సిఐడీ సీరియస్ గా ఫోకస్ చేసింది. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ భూములను ఏ విధంగా సొంతం చేసుకున్నారు, ఏంటీ అనే దానిపై అధికారులు మొత్తం కూపీ లాగుతున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక రెవెన్యూ అధికారుల పాత్ర ఎంత వరకు ఉందనే దానిపై కూడా అధికారులు దృష్టి సారించారు. జోగి రమేష్ ఆదేశించిన వెంటనే తప్పుడు పనులు చేసింది ఎవరూ అనే దాని మీద దృష్టి పెట్టారు.

Jogi Ramesh and Jogi Rajeev With YS Jagan Mohan Reddy

వీరు కాక పై నుంచి ఇంకెవరు అయినా ఉన్నారా అనే దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పెద్దలు ఎవరైనా చెప్తే చేసారా అనే విషయం పై కూడా అధికారులు ఇప్పుడు కూపీ లాగుతున్నారు. ఇందులో ఇతర వైసీపీ నేతల హస్తంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంచితే తాజాగా దీనిపై మరో కేసు నమోదు అయ్యే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మ లేదంటున్న పోలవరం మురళీమోహన్ పలు కీలక విషయాలను వెల్లడించారు.

YCP Leader Jogi Ramesh

ఇదే కేసులో నిందితుడుగా ఉన్న ఆయన… తాను జోగి ఫ్యామిలీకి ఎటువంటి భూమి విక్రయించలేదని సిఐడి కి వాంగ్మూలం ఇచ్చారు. అయితే మురళీమోహన్ కి భూమి సర్వే నెంబర్ 88 లో ఉంది.. మొదటి జోగి ఫ్యామిలీ సర్వే నెంబర్ 88 తో రిజిస్ట్రేషన్ చేయించుకొని… సర్వేనెంబర్ 87 గా అధికారాన్ని వినియోగించుకుని రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పోలవరపు మురళీమోహన్ పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ గాని, ఆధార్ కార్డు గాని తనది కాదని సిఐడి కి మురళి చెప్పడంతో జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. దీంతో తవ్వే కొద్దీ జోగి రమేష్ కుటుంబం ఈ వ్యవహారంలో మరింత లోతుగా ఇరుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్