Tuesday, June 23, 2026 06:53 PM
Tuesday, June 23, 2026 06:53 PM

లోకేష్ చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం

కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం కోరితే నేనున్నానని భరోసానివ్వడం యువనేత నారా లోకేష్ నైజం. ఈ అరుదైన లక్షణమే ఆయనను కోట్లాదిమంది ప్రజల అభిమాన నేతగా మార్చింది. ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదంతం చివరకు మంత్రి లోకేష్ చొరవతో చివరకు సుఖాంతమైంది. తాజాగా అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందుల తాలూకూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్ అయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ వెనువెంటనే స్పందించి ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేసి, తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

శివ చేసిన వీడియోలో తాను ఎక్కడనుంచి మాట్లాడుతున్నది చెప్పకపోవడంతో అతడి అడ్రస్ ను గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టిడిపి విభాగం కొంత కష్టపడాల్సి వచ్చింది. లోకేష్ ఆదేశాలతో రెండురోజులపాటు గాలించిన గల్ఫ్ టిడిపి విభాగం నాయకులు… ఎట్టకేలకు శివ అడ్రస్ ను గుర్తించి అతడు తిరిగి స్వస్థలానికి చేరడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి చేరుకున్న శివ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి నారా లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని, తాను స్వగ్రామానికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన మరువలేనని కన్నీళ్ల పర్యంతమయ్యారు. శివ స్వస్థలానికి చేరడానికి సహకరించిన లోకేష్ కు ఆయన కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ… మంత్రి లోకేష్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.

కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి స్పందించి శివ కథను సుఖాంతం చేసిన మంత్రి లోకేష్ పై ప్రసారమాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లోకేష్ పనితీరు నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్నప్రజల కోసం ఎందాకైనా వెళ్లి ఆపన్నహస్తం అందించే మీ కమిట్మెంట్ కు హ్యాట్సాఫ్ అంటూ బాలాజీగుప్త అనే నెటిజన్ లోకేష్ ను అభినందించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాపులకు జగన్ నమ్మకద్రోహం.....

ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో ఎన్నో...

సాయికృష్ణ అదృశ్యం కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ...

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

పోల్స్