Monday, November 23, 2026 09:52 PM
Monday, November 23, 2026 09:52 PM

ఈరోజు రాశి ఫలితాలు (22-11-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, శుక్ల పక్షం.. 22-11-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి.
—————————————

వృషభం

వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
—————————————

మిధునం

ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————

కర్కాటకం

బందువర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.
—————————————

సింహం

స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
—————————————

కన్య

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
—————————————

తుల

దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
—————————————

వృశ్చికం

పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.
—————————————

ధనస్సు

వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధనపరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు.
—————————————

మకరం

వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది.
—————————————

కుంభం

ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
—————————————

మీనం

వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందుల చరిత్రలో కొత్త...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

కార్యకర్తే కింగ్.. కర్నూలు...

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ..కష్టకాలంలో...

ఎక్స్‌ప్లోరర్ పెద్దపులి బోనుకు...

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు...

అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా...

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగానే నాయకులు...

ఏపీకి మరో రెండు,...

ఇటీవల సంభవించిన 'అర్నబ్', 'మురసు' తుపానుల...

రిలయన్స్ దూకుడు.. ఏడాదిలోనే..!

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్...

పోల్స్