అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్సెట్ రంగాల్లో ప్రముఖ సంస్థ ఎన్విడియా చుట్టూ నెలకొన్న తాజా వివాదాలు, సరఫరా గొలుసు ఆందోళనల నడుమ భారత్ ఒక అత్యంత వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సెమీకండక్టర్ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతను బలోపేతం చేసే దిశగా అమెరికా నేతృత్వంలో రూపొందించిన ‘శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్’ లో భారత్ అధికారిక భాగస్వామిగా చేరింది. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై అమెరికాతో పాటు పలు కీలక మిత్రదేశాలతో కలిసి భారత్ సంతకం చేయడం ప్రపంచ టెక్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : వైసీపీలో భారీ ప్రక్షాళన.. వేటుకు వేళ..!
ఆధునిక సాంకేతిక యుగంలో ఏఐ చిప్‌లు, సెమీకండక్టర్ల కొరత చైనా ఏకపక్ష గుత్తాధిపత్యాలకు చెక్ పెట్టేందుకు ఈ డిక్లరేషన్ ఎంతో కీలకంగా మారనుంది. భవిష్యత్ సాంకేతిక అవసరాల దృష్ట్యా విశ్వసనీయమైన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో భద్రతా ప్రమాణాలను పాటించడం ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇటీవలి పరిణామాలతో ‘ఎన్విడియా’ వంటి దిగ్గజ సంస్థల చిప్‌ల ఎగుమతులు, నియంత్రణలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, భారత్ తీసుకున్న ఈ నిర్ణయం దేశీయ టెక్ రంగానికి కొత్త ఊపునివ్వనుంది.
Also Read : స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఈ ఒప్పందంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీకి అత్యవసరమైన కీలక ఖనిజాల రీసైక్లింగ్, శుద్ధి ప్రక్రియలో భారత్‌కు అమెరికా సాంకేతిక సహకారం అందించనుంది. లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడే పరిస్థితిని తప్పించి, దేశీయంగానే వాటిని రీసైకిల్ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ సాయం ఎంతో ఉపయోగపడనుంది. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ లక్ష్యాలు మరింత వేగవంతం కావడంతో పాటు, గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ స్థానం మరింత పటిష్టం కానుంది.


