Monday, November 16, 2026 08:01 PM
Monday, November 16, 2026 08:01 PM

వైసీపీలో భారీ ప్రక్షాళన.. వేటుకు వేళ..!

టార్గెట్ 2029.. ఎన్నికల్లో మనం గెలవాల్సిందే. లేకపోతే ఇక లేనట్లే.. ఇవి తాజాగా తమ పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. “ఏది ఏమైనా సరే.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. ఇందుకోసం మీకు పార్టీ తరఫున ఎలాంటి సపోర్టు కావాలన్నా ఇస్తాం.. మీరు నియోజకవర్గాల్లో ఎలా పనిచేస్తారో ఇక నుంచి ప్రతి రోజూ, ప్రతి విషయం గమనిస్తూనే ఉంటాం.. బీ కేర్ ఫుల్..” అని లీడర్లకు జగన్ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు జగన్ చెప్పిన మాటలు, చేసే పనులు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : అందరూ మర్చిపోయినా.. ఆ బాలిక ప్రాణం కోసం లోకేష్ తపన..!

వై నాట్ 175 అనేది 2024 ఎన్నికలకు ముందు వైసీపీ లక్ష్యం. అదే సమయంలో 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని కూడా అప్పట్లో జగన్ పదే పదే చెప్పుకొచ్చారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. నిజానికి 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు జరిగిన అవమానం కారణంగా అసెంబ్లీకి వెళ్లే వారు కాదు. అలాగే.. టీడీపీ నేతలపై దాడులు, కేసులు ఎక్కువయ్యేవి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు పరిపాలన చేసే వాళ్లు. టీడీపీ కేడర్‌ను భయపెట్టే వాళ్లు. దీంతో టీడీపీ ఓటు బ్యాంకు తగ్గించాలనేది అప్పుడు వైసీపీ నేతల ప్లాన్. కానీ ఓటర్ తీర్పుతో వైసీపీ నేతల దిమ్మ తిరిగిపోయింది. 175 అంటూ బరిలోకి దిగిన జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు.

ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వైసీపీలో గట్టిగా ముందుండి నడిపించే నేతలు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలోనే ఉన్నారు. మీడియా ముందు కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ.. ఆ నలుగురే హడావుడి చేస్తున్నారు. అంతే తప్ప.. గట్టిగా పార్టీ కార్యక్రమాలు చేసే లీడర్లు ఎక్కడా కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఈ విషయం కార్పొరేషన్, మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తేలిపోయింది. ఏదో ఓ నాలుగైదు చోట్ల తప్ప.. మిగిలిన చోట్ల ఎన్నికలు జరిగినా.. ముఖ్యమైన నేతలు, మాజీ మంత్రులు ఎక్కడా అంతగా కనిపించలేదు. సొంత మీడియా మైకుల ముందు.. కాసేపు హడావుడి చేశారు తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అస్సలు కనిపించలేదు.

వైసీపీ నేతలను ఉత్సాహపరిచేందుకు, క్యాడర్‌ను తిరిగి యాక్టివేట్ చేసేందుకు మళ్లీ పాదయాత్రతో మీ ముందుకు వస్తున్నా.. అంటూ జగన్ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన నాటి నుంచి సొంత పార్టీలోనే నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే జనం తిడుతున్నారు.. ఇక జగన్ పాదయాత్ర అంటే.. తంతారేమో.. అని లోపల్లోపల తిట్టుకుంటున్నారు కూడా. పాదయాత్ర అంటే మళ్లీ అదో ఖర్చు అనేది కొంతమంది భయం. ఇదే విషయాన్ని తమ క్యాడర్ వద్ద కూడా ఇప్పటికే కొందరు ప్రస్తావించారు. ఈ విషయం ఇప్పుడు పార్టీ పెద్దల వరకు చేరుకుంది. దీంతో పార్టీ ప్రక్షాళన చేయకపోతే.. కష్టమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు..!

వైసీపీలో భారీ ప్రక్షాళన దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న చాలా మంది నియోజకవర్గం ఇంఛార్జుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెర మీదకు కొత్త క్యాలిక్యులేషన్లను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక ఫలితాలపై తాడేపల్లి వేదికగా జగన్ పూర్తిస్థాయి పోస్టుమార్టం నిర్వహించినట్లు సమాచారం. 60-70 మంది ఇంచార్జ్‌ల పనితీరు బాగోలేదని అధిష్టానానికి ఇప్పటికే నివేదిక అందినట్లు విశ్వసనీయ సమాచారం. చాలా మంది నేతలు హౌస్ అరెస్టుల పేరుతో సెల్ఫీ వీడియోలకే పరిమితమయ్యేరనే విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కొందమంది మేయర్, చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేసిన అభ్యర్థులు అయితే.. పార్టీ పెద్దలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. “అప్పులు చేసి పోటీ చేశాం, ఇంచార్జ్‌లు సహకరించలేదు..” అంటూ అభ్యర్థుల ఫిర్యాదును కూడా సమావేశం పరిశీలించారు. దీంతో పంచాయతీ ఎన్నికలే నేతలకు యాసిడ్ టెస్ట్ అని.. సంక్రాంతి తర్వాత భారీ యాక్షన్ ఉంటుందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. కనీసం 30 నుంచి 40 మందికి పైగా ఇంచార్జ్‌లపై వేటు ఖాయమని.. సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రక్షాళన చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త, పాత నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా.. వైసీపీ మళ్లీ పుంజుకుంటుందా.. చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

పోల్స్