Saturday, November 14, 2026 06:29 PM
Saturday, November 14, 2026 06:29 PM

వెండితెర పై చెరగని ముద్ర.. నటుడు గిరిబాబు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 14) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read : సాక్షి ఛానల్ కు షాక్ ఇచ్చిన అమరావతి రైతు..!

రావినూతల నుంచి వెండితెర వరకు

గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1946 జూన్‌ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు. విద్యార్థి దశలోనే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన, సినీ అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్‌ తొలినాళ్లలో కథానాయకుడిగానూ నటించిన గిరిబాబు, ఆ తర్వాత ప్రతినాయక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

విభిన్న పాత్రలతో తరతరాల ప్రేక్షకులకు చేరువ

సుదీర్ఘ సినీ ప్రస్థానంలో గిరిబాబు 600కు పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయక పాత్రలతో పాటు సహాయ, హాస్య పాత్రల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. ‘కురుక్షేత్రం’, ‘కరుణమయుడు’, ‘బంగారు కుటుంబం’, ‘సిసింద్రీ’ వంటి చిత్రాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత ‘అతడు’, ‘గీత గోవిందం’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో కొత్తతరం ప్రేక్షకులకూ చేరువయ్యారు. ‘అతడు’లో కథానాయిక తండ్రిగా, ‘జాతి రత్నాలు’లో ముఖ్యమంత్రిగా కనిపించారు. 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ ఆయన నటించిన చివరి చిత్రం.

Also Read : డేంజర్ జోన్‌లో ఏపీ.. మళ్లీ హై అలర్ట్..!

నిర్మాతగా, దర్శకుడిగానూ

నటనతో పాటు చిత్ర నిర్మాణం, దర్శకత్వంలోనూ గిరిబాబు తనదైన ముద్ర వేశారు. ‘సింహ గర్జన’, ‘మెరుపు దాడి’, ‘ఇంద్రజిత్‌’ చిత్రాలను నిర్మించారు. ‘మెరుపు దాడి’కి కథ అందించిన ఆయన, ‘రణరంగం’, ‘ఇంద్రజిత్‌’, ‘నీ సుఖమే నే కోరుతున్నా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు రఘుబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా గుర్తింపు పొందారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సాక్షి ఛానల్ కు...

రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అసత్య...

జగన్ చెప్పినా వినను.....

ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యవహరించే...

సర్పంచ్.. ఒకటో సారి.....

అయ్య బాబోయ్.. అమ్మ భాబోయ్.. పంచాయతీ...

కూటమికి ఇబ్బందిగా మారిన...

అధికారం అండతో ప్రజాప్రతినిధులు నిబంధనలను తుంగలో...

డేంజర్ జోన్‌లో ఏపీ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా...

పంచాయతీ “రాజీ” కియాలు..!

రంగులు మారుతున్న పంచాయతీ "రాజీ" కియాలు.....

పోల్స్