Thursday, November 12, 2026 08:04 PM
Thursday, November 12, 2026 08:04 PM

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. మధ్యలో చైర్మన్..!

పల్నాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఉంటాయో.. వర్గ పోరు కూడా అదే స్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు సొంత పార్టీ నేతల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తుంది కూడా. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గం.. కానీ కేవలం ఆధిపత్య పోరు కారణంగా.. అక్కడ వరుసగా కాంగ్రెస్, వైసీపీ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ.. 2024 అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి టీడీపీ గెలిచింది. కానీ ప్రస్తుతం మాత్రం.. మునిసిపల్ చైర్మన్ ఎన్నికలు మరోసారి తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీశాయి. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి కూడా చేరింది.

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం తొలి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గానే ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున కాసు వెంకట కృష్ణారెడ్డి గెలిచారు. ఆ తర్వాత వైసీపీ తరఫున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అయితే వైసీపీలో గ్రూపులు, టీడీపీ నేతలపై దాడుల కారణంగా.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ అరవింద్ బాబుపై ఇప్పుడు సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్..!

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే విషయం పెద్ద దుమారం రేపుతోంది. అరవింద్ బాబు బీసీ కావడంతో.. చైర్మన్ అభ్యర్థిగా ఆర్యవైశ్య, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. వరుసగా ఐదు సార్లు కోడెల శివప్రసాదరావు గెలుపులో కీలక పాత్ర పోషించిన కమ్మ సామాజిక వర్గం నేతలు ఇప్పుడు చైర్మన్ సీటు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పక్కనే ఉన్న సత్తెనపల్లిలో కూడా ఇప్పుడు కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో తమకే తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపుతోంది.

మునిసిపల్ చైర్మన్‌ అభ్యర్థిగా సుబ్బరాయ గుప్త అంటూ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేసిన ప్రకటన కమ్మ సామాజిక వర్గం నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరొకరికి హామీ ఇచ్చారనే మాట కూడా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలకు కారణమవుతోంది. తమకే అవకాశం ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి రవి డిమాండ్ చేస్తున్నారు. గతంలో మునిసిపల్ చైర్మన్‌గా పని చేసిన రవి.. ఇప్పుడు చైర్మన్ రేసులో ఉన్నారు. ఇప్పటికే పార్టీ పెద్దల ద్వారా మంతనాలు జరుపుతున్నారు. సినీ నటుడు శివాజీ కూడా రవికి మద్దతుగా నిలిచారనే మాట బాగా వినిపిస్తోంది. కానీ ఇంతలో సుబ్బరాయ గుప్త పేరును ఎమ్మెల్యే ప్రకటించడం పట్ల.. పార్టీ పెద్దలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ సంచలన అడుగులు..!

మరోవైపు ఆర్యవైశ్య సామాజికవర్గంలోనే సుబ్బరాయ గుప్త అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా పని చేసిన కపిలవాయి విజయ్ కుమార్.. ప్రస్తుతం టీడీపీలో కీలక నేతగా పని చేస్తున్నారు. ఆయన కూడా చైర్మన్ రేసులో ఉన్నారు. దీంతో ఆర్యవైశ్య సామాజిక వర్గంలోనే గుప్త వర్సెస్ విజయ్ కుమార్ అన్నట్లుగా పోరు నడుస్తోంది. ఇటు బీసీ ఎమ్మెల్యే, అటు కమ్మ, ఆర్యవైశ్య సామాజిక వర్గాల మధ్య సీటు పంచాయతీ అనేది ఇప్పుడు నరసరావుపేటలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఫ్యాక్షన్ గొడవలు.. మరోవైపు ఆధిపత్య పోరుతో.. నరసరావుపేట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

లోకేష్ కు పవన్...

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ...

ఏపీకి భారీ పెట్టుబడుల...

ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో మరో...

పోల్స్