Thursday, November 12, 2026 04:02 PM
Thursday, November 12, 2026 04:02 PM

ఈసీ టార్గెట్ ఆ జిల్లాలే.. పల్నాడుపైనే స్పెషల్ ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ స్థానిక సంస్థలు.. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత విడత మున్సిపల్, పరిషత్ ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల చెలరేగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన అన్ని జిల్లాల ఎస్పీలతో ఆయన కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Also Read : ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. మరో ప్రముఖ కంపెనీ ఎంట్రీ..!

ముఖ్యంగా గత ఎన్నికల్లో ఉద్రిక్తతలు తలెత్తిన పల్నాడు, రాయలసీమ జిల్లాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. నామినేషన్ల స్వీకరణ నుండి పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర నిఘా ఉంచాలని కమిషన్ భావిస్తోంది. సమస్యాత్మక గ్రామాలు, వార్డులను ముందే గుర్తించి రౌడీషీటర్లు, అల్లరిమూకలపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.

Also Read : చార్లెస్ శోభరాజ్ ప్రియురాలికి భోజనం.. సోనియా పుస్తకంలో ఆసక్తికర విషయాలు..!

ఈ నెల 14న జరగనున్న సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణపై ఎస్పీలకు పునేఠా దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినా లేదా రాజకీయ పక్షపాతంతో వ్యవహరించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నెల 26న 23 పట్టణ స్థానిక సంస్థలు, తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఓటర్లు ఎటువంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్‌ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

లోకేష్ కు పవన్...

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ...

ఏపీకి భారీ పెట్టుబడుల...

ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో మరో...

జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్లే...

ఏపీలో జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. మరో...

పోల్స్