Thursday, November 12, 2026 04:01 PM
Thursday, November 12, 2026 04:01 PM

వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్..!

ఐపీఎల్ 2027 వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఊహించని చిక్కు వచ్చి పడింది. జట్టు కెప్టెన్‌గా కొనసాగేందుకు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తాజా కథనాల ద్వారా తెలుస్తోంది. నాయకత్వ బాధ్యతలను వదులుకోవాలని అక్షర్ భావిస్తుండటంతో, అతడిని ఒప్పించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిణామంతో ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ ప్రస్తుతం గందరగోళంలో పడింది. గత రెండు సీజన్లలో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మిశ్రమ ఫలితాలను అందుకుంటూ ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది.

Also Read : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ స్పీడ్..!

దీనికి తోడు, కెప్టెన్సీ ఒత్తిడి అక్షర్ వ్యక్తిగత ప్రదర్శనపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో 14 మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 173 పరుగులు చేసి, 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే నాయకత్వ భారం దించుకుని, ఆటగాడిగా స్వేచ్ఛగా రాణించాలని అక్షర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, అక్షర్ పటేల్‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చినప్పటికీ, ఢిల్లీ యాజమాన్యం వాటన్నింటినీ తిరస్కరించింది.

Also Read : మరోసారి సింగర్‌గా మారిన బాలయ్య..!

అక్షర్ తమ జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడని భావిస్తున్న మేనేజ్‌మెంట్, డిసెంబర్‌లో జరిగే వేలం ముగిసే వరకు కెప్టెన్సీ విషయంలో తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇప్పటికే ప్రధాన కోచ్‌గా సౌరవ్ గంగూలీ, సహాయక సిబ్బందిగా యువరాజ్ సింగ్, చమిందా వాస్, అమిత్ మిశ్రాలు చేరడంతో పాటు, మాజీ సారథి రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌లో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అక్షర్ పటేల్ ససేమిరా అంటే, తిరిగి జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగిస్తారా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

లోకేష్ కు పవన్...

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ...

ఏపీకి భారీ పెట్టుబడుల...

ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో మరో...

పోల్స్