Wednesday, November 11, 2026 06:32 AM
Wednesday, November 11, 2026 06:32 AM

ఈరోజు రాశి ఫలితాలు (11-11-2026)

మేషం

బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాతృ వర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
————————–

వృషభం

గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి.
————————–

మిధునం

సంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్దలు కలుగుతాయి.
————————–

కర్కాటకం

బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంటాబయట సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
————————–

సింహం

నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
————————–

కన్య

అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
————————–

తుల

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. దూరప్రాంత బంధువుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
————————–

వృశ్చికం

ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. నూతన ఋణయత్నాలు నిదానంగా సాగుతాయి.
————————–

ధనస్సు

మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమౌతాయి.
————————–

మకరం

సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలంగా సాగుతాయి.
————————–

కుంభం

ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.
————————–

మీనం

నిరుద్యోగుల కష్టం ఫలించదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి
————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

నాకేమీ పేటీఎంలో డబ్బులు...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై...

స్థానిక విజయాలతో అహం...

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల...

వైసీపీ మీద ఓటర్లకు...

అప్పుడు వైసీపీ ఓటమికి, వైసీపీ రెడ్లు,...

పవన్ విడాకులపై వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్...

పెట్రోల్ బంకులలో కొత్త...

గుంటూరు నగరంలోని చుట్టుగుంట వీఐపీ రోడ్డులో...

పోల్స్