Monday, November 2, 2026 06:01 PM
Monday, November 2, 2026 06:01 PM

సాయిరెడ్డి కొత్త పార్టీ వెనుక ఆ ఆరుగురు ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా నిలవాలని చూస్తున్న మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి నవంబర్ 11న తన నూతన పార్టీ ఆవిర్భావానికి విజయవాడ వేదికగా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఈ పార్టీ కేవలం సాయిరెడ్డి సొంత ఆలోచనలతోనే కాకుండా, వైసీపీలో ఒకప్పుడు అత్యంత కీలక భూమిక పోషించిన కొందరు కీలక మాజీ ప్రజాప్రతినిధుల వ్యూహాలతో రూపుదిద్దుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకప్పుడు వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పి, ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న దాదాపు ఆరుగురు సీనియర్ నేతలు విజయసాయి రెడ్డి కొత్త పార్టీ వెనుక వ్యూహకర్తలుగా ఉన్నట్లు సమాచారం.

Also Read : ఆ విద్యార్థులకు ధైర్యం కోసం.. లోకేష్ వినూత్న ప్రయత్నం

వైసీపీలో తాము ఎదుర్కొన్న సవాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త పార్టీ ఏ రకమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలో ఈ ఆరుగురు నేతలు సాయిరెడ్డికి దిశానిర్దేశం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా జిల్లాలకు చెందిన ఈ ఆరుగురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ఏర్పాటు, విధివిధానాల ఖరారులో సాయిరెడ్డికి నిరంతరం కీలక సలహాలు, సూచనలు ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

వైసీపీలో తీవ్ర మనోవేదనకు గురై బయటకు వచ్చానని విజయసాయి రెడ్డి స్వయంగా విజయవాడ ప్రెస్ మీట్‌లో బహిరంగంగానే ప్రకటించిన నేపథ్యంలో, ఇదే తరహా అసంతృప్తితో ఉన్న సదరు ఆరుగురు నేతలు సాయిరెడ్డి పెట్టబోయే వేదిక ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని ప్రణాళికలు వేస్తున్నారు. కొత్త పార్టీ పేరు, జెండా, మరియు ప్రధాన ఎజెండాను ఖరారు చేయడంలో ఈ ఆరుగురు మాజీ ప్రజాప్రతినిధుల బృందం కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం పాత కాపులతోనే కాకుండా, రాష్ట్రంలో కొత్త తరం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఈ పార్టీ కార్యాచరణ ఉండాలని వీరు సాయిరెడ్డికి గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది.

Also Read : 30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం

నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక ఆవిర్భావ వేదికపై విజయసాయి రెడ్డితో పాటు వైసీపీకి చెందిన సదరు ఆరుగురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారికంగా ప్రత్యక్షమయ్యే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే టీడీపీ నుంచి ఓవీ రమణ లాంటి సీనియర్లు సాయిరెడ్డికి మద్దతు ప్రకటించగా, రాబోయే రోజుల్లో వైసీపీ మాజీల ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తెలంగాణాపై గురిపెట్టిన అమిత్...

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్...

ఐఏఎస్ అధికారుల చేతికి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై...

30 ఏళ్ల తర్వాత...

కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం...

ఆ విద్యార్థులకు ధైర్యం...

రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన...

హైదరాబాద్ కి పొంచి...

ఎల్ నినో ప్రభావం.. తగ్గిన వర్షపాతం...

అప్పుడు ఉమేష్ చంద్ర.....

1996లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి...

పోల్స్