Monday, November 2, 2026 04:17 PM
Monday, November 2, 2026 04:17 PM

ఆ విద్యార్థులకు ధైర్యం కోసం.. లోకేష్ వినూత్న ప్రయత్నం

రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన శారీరకంగా గోపిక అనే విద్యార్థినిపై జరిగిన దాడే అయినప్పటికీ, ఆ ఘోరాన్ని కళ్లారా చూసిన తోటి విద్యార్థుల మనస్సులపై అది వేసిన ముద్ర వర్ణనాతీతం. దారుణమైన రక్తపాతం, నిందితుడి ఉన్మాద రూపాన్ని ప్రత్యక్షంగా చూసిన పదో తరగతి ఏ సెక్షన్‌ విద్యార్థులు తీవ్రమైన మానసిక ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురయ్యారు.అందరూ బాధితురాలి ఆరోగ్యం, నిందితుడి శిక్ష గురించే మాట్లాడుతున్న వేళ.. ఆ కష్టాన్ని, తోటి విద్యార్థినుల మానసిక పరిస్థితిని ముందే పసిగట్టిన విద్యార్థి లోకం సంక్షేమ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

Also Read : ఫస్ట్ సినిమా రాకముందే.. చరణ్ సరసన ఛాన్స్?

ఘటన తాలూకు భయాందోళనల నుంచి విద్యార్థులను బయటపడేసి, వారిలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 20 మంది మానసిక ఆరోగ్య నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఘటన జరిగిన క్లాస్‌రూమ్‌కు చెందిన 32 మంది విద్యార్థుల ఇళ్లకు ఈ కౌన్సెలర్లు స్వయంగా వెళ్లి, పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలోని 8, 9, 10 తరగతుల విద్యార్థినులందరి ఇళ్లను సందర్శించి భద్రతపై కొండంత భరోసా కల్పిస్తున్నారు.

పిల్లలు ఆ రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడి లేవకుండా, భయంతో బడి మానకుండా ఉండేలా నిపుణులు వారికి మానసిక ధైర్యం చెప్తున్నారు. పాఠశాల వాతావరణం మళ్లీ సురక్షితంగా మారిందని, భయపడకుండా చదువుపై దృష్టి సారించాలని అవగాహన కల్పిస్తున్నారు. కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల ఇళ్ల వరకు అధికారులను, నిపుణులను పంపి ధైర్యాన్ని నూరిపోస్తున్న ఈ విధానం పట్ల స్థానిక తల్లిదండ్రుల నుంచి తీవ్ర హర్షం వ్యక్తమవుతోంది.

Also Read : భువీపై పెట్టుకున్న ఆశలు ఆవిరి..!

విపత్తు లేదా ఘోరం జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించి, దానికి తగ్గట్టుగా వేగంగా స్పందించడంలో మంత్రి నారా లోకేష్ మరోసారి తన పరిపాలనా సమర్థతను చాటుకున్నారు. ఒకవైపు బాధితురాలికి అత్యుత్తమ వైద్యం అందిస్తూనే, మరోవైపు తోటి పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా తీసుకున్న ఈ ముందస్తు చర్యలు ఆయనలోని సున్నితమైన,మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సాయిరెడ్డి కొత్త పార్టీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా...

30 ఏళ్ల తర్వాత...

కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం...

హైదరాబాద్ కి పొంచి...

ఎల్ నినో ప్రభావం.. తగ్గిన వర్షపాతం...

అప్పుడు ఉమేష్ చంద్ర.....

1996లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి...

భువీపై పెట్టుకున్న ఆశలు...

భారత జట్టులోకి సుదీర్ఘ విరామం తర్వాత...

జగన్‌కు ఊహించని షాక్.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్...

పోల్స్