Sunday, November 1, 2026 11:55 AM
Sunday, November 1, 2026 11:55 AM

చీ.. ఇది కూడా రాజకీయమేనా.. మీరు మారరా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాప్తాడులో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది దాడి చేశాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై చెట్ల కొమ్మలు కోసే రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే.. టీచర్ పాఠం చెబుతుండగానే.. తరగతి గదిలోకి వచ్చిన ఉన్మాది.. బాలికపై రంపంతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాలికను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించాలని ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. బాలిక ఆరోగ్యం, వైద్యంపై మంత్రి సత్యకుమార్ స్వయంగా సమీక్ష చేస్తున్నారు.

Also Read : పులివెందులలో జగన్, అవినాష్ భారీ కుట్ర: బీటెక్ రవి సంచలన ఆరోపణలు..!

అయితే విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన పాఠశాల ప్రాంగణంలోనే ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలల్లోకి అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకుండా తగిన భద్రతా చర్యలు ఉన్నాయా..? విద్యార్థుల రక్షణకు అవసరమైన పర్యవేక్షణ కొనసాగుతోందా..? అనే అంశాలపై విద్యాశాఖ, పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు..? విద్యార్థినికి తెలిసిన వ్యక్తేనా..? వ్యక్తిగత కక్షలతో ఈ దారుణానికి పాల్పడ్డాడా..? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉండాల్సిన పాఠశాలలోనే ఇలాంటి ఘటన జరగడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read : హిందువుల ఓట్లు లేవు.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..!

నిజానికి ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు, సీనియర్ ఉపాధ్యాయులు కూడా ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఉన్మాది దాడి సమయంలో తగినంత మంది సిబ్బంది కూడా లేకపోవడానికి ఇది కూడా ఒక కారణమే అని తెలుస్తోంది. దాడి పై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. “చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు.” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Also Read : ఏపీ బ్రాండ్ పవర్.. మేడ్‌ ఇన్‌ తిరుపతి.. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు

అయితే ఇదే అదునుగా భావించిన వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు తెర లేపారు. నిజానికి బాలికపై దాడి అత్యంత దారుణం. ఇది ఎవరైనా ఖండించాల్సిన అంశమే. బాలికకు వైద్యం సరిగ్గా అందకపోతే.. అది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఉన్మాదిని పట్టుకోకపోతే.. అది ప్రభుత్వ వైఫల్యం. ఈ విషయం ఎవరైనా అంగీకరించాల్సిందే. కానీ వైసీపీ మేధావి వర్గం మాత్రం.. సందట్లో సడేమియా అన్నట్లుగా దాడికి ప్రభుత్వమే కారణమంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. “సర్కారు పాఠశాల తరగతి గదిలోకి అంగంతక వ్యక్తి చొరబడి, విద్యార్థుల ముందే ఒక విద్యార్థినిపై రంపంతో దాడి చేసి ముఖాన్ని కోస్తుంటే… విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నాడు?.. కూటమి పాలనలో భద్రతా వ్యవస్థ ఎక్కడుంది? విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఏది?.. బడుల్లో విద్యార్థులకు భద్రత కల్పించలేని విద్యాశాఖ ఎందుకు? ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి! విద్యార్థుల ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితుల్లో మీ పాలన ఉందా పవన్ కళ్యాణ్ ?” అంటూ సొంత మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

దాడి చేస్తుంటే.. లోకేష్ ఏం చేస్తున్నాడు..? అనే ప్రశ్న వారి అవగాహన రాహిత్యానికి పరాకాష్ఠ. నిజానికి ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఇలా అనుకోకుండా జరిగే దారుణాలను కూడా మంత్రి నారా లోకేష్ వైఫల్యం అనేలా వ్యాఖ్యానించడం దారుణం. సాధారణంగా చెట్ల కొమ్మలు కోసే రంపం కావడంతో.. పాఠశాలలో ఏవైనా శుభ్రం చేసేందుకు వస్తున్నాడేమో.. అని సిబ్బంది భావించారు. కానీ.. ఇలా నేరుగా తరగతి గదిలోకి వచ్చిన ఘాతుకానికి ఒడిగడతాడని ఎవరూ ఊహించలేదు. నిందితుడిని కఠినంగా శిక్షించకపోతే.. అది ప్రభుత్వ వైఫల్యం.. అప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా కోసం డిమాండ్ చేయాలి. ఆందోళనలు చేయాలి. అంతే కానీ.. ఇలా దాడి జరిగిన వెంటనే.. రాజీనామా అంటే.. వారిది రాజకీయమనే అంటారు. జగన్ జమానాలో అమర్‌నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని ఎందుకు శిక్షించలేదు. అప్పుడు జగన్ రాజీనామాకు ఎందుకు డిమాండ్ చేయలేదు.. అంటే.. నో ఆన్సర్.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందులలో జగన్, అవినాష్...

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న...

హిందువుల ఓట్లు లేవు.....

ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ...

ఏపీ బ్రాండ్ పవర్.....

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరో గొప్ప ఘనత...

సెమీ ఫైనల్.. అసలు...

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార...

చంద్రబాబు లేఖతో రెండు...

అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంపై ఏపీ...

ఏపీలో అర్నబ్ తుఫాన్...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ రాష్ట్రానికి...

పోల్స్