Saturday, October 31, 2026 01:41 PM
Saturday, October 31, 2026 01:41 PM

తుఫాన్ వేళ వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రభుత్వం సక్సెస్..!

అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫారమ్ బాధితులకు పెద్ద దిక్కుగా నిలిచింది. విపత్తు సమయంలో సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా చేతిలోని మొబైల్ ద్వారానే ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందస్తు ఆదేశాల మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఈ వాట్సాప్ సేవలను విపత్తు నిర్వహణకు సమర్థవంతంగా అనుసంధానించింది.

Also Read : ఏపీలో అర్నబ్ తుఫాన్ తెచ్చిన జలకళ..!

బాధితులు పంపిన ఫిర్యాదులను స్వీకరించి, వాటిని తక్షణమే స్థానిక స్వర్ణ గ్రామాలు, వార్డు ఆఫీసులకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. ఈ తుఫాన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా బాధితుల నుంచి 1,500లకు పైగా సమస్యలు మనమిత్ర ప్లాట్‌ఫారమ్‌కు చేరాయి. ఇందులో అత్యధికంగా 95 శాతానికి పైగా సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పరిష్కరించి రికార్డు సృష్టించింది. వరద నీరు చేరడం, చెట్లు విరిగిపడటం, విద్యుత్ అంతరాయాలు, తాగునీరు మరియు ఆహార కొరత, అత్యవసర మందుల సరఫరా వంటి కదలికలపై బాధితులు వాట్సాప్ ద్వారా సమాచారం పంపారు.

Also Read : ఏపీ బ్రాండ్ పవర్.. మేడ్‌ ఇన్‌ తిరుపతి.. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు

ఆర్టీజీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్ ఈ ఫిర్యాదులపై నిరంతరం నిఘా ఉంచి, క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే మనమిత్రకు అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వివిధ జిల్లాల వారీగా అందిన సమస్యల వివరాలు చూస్తే.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 253 ఫిర్యాదులు, కాకినాడ నుంచి 247, విశాఖపట్నం నుంచి 239, పశ్చిమ గోదావరి నుంచి 159, తూర్పు గోదావరి నుంచి 101, మరియు శ్రీకాకుళం జిల్లా నుంచి 82 ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. విపత్తుల నిర్వహణలో సాంకేతికతను జోడించి పారదర్శకమైన పాలన అందించవచ్చని ఏపీ ప్రభుత్వం ఈ మనమిత్ర ద్వారా మరోసారి నిరూపించింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ బ్రాండ్ పవర్.....

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరో గొప్ప ఘనత...

సెమీ ఫైనల్.. అసలు...

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార...

చంద్రబాబు లేఖతో రెండు...

అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంపై ఏపీ...

ఏపీలో అర్నబ్ తుఫాన్...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ రాష్ట్రానికి...

జగన్ వార్నింగ్ కు...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం...

మిథున్ రెడ్డి అరెస్ట్‌కు...

రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్...

పోల్స్