Friday, October 30, 2026 11:38 AM
Friday, October 30, 2026 11:38 AM

బ్రేకింగ్: హిమాలయాల్లో మరో అలజడి.. టార్గెట్ భారత్..?

భూటాన్‌లోని గాసా జిల్లాలో ఉన్న శింటాఫు సరస్సు గురువారం సాయంత్రం ఒక్కసారిగా తెగినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు భారత్ ను కలవరపెడుతున్నాయి. రెండు నెలల క్రితం నేపాల్ వరదలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహా లో భారత్ లో కూడా వరదలు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. గ్లేసియర్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ గా పిలిచే ఈ ప్రమాదం కారణంగా కొండచరియలు విరిగిపడి, గడ్డకట్టిన మంచు ఒక్కసారిగా కరిగి భారీ ఎత్తున వరద నీరు దిగువకు దూసుకువస్తోంది.

Also Read : గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్!

భూటాన్ దేశంలోని అత్యంత ప్రమాదకరమైన 17 హిమనదీ సరస్సులలో ఈ శింటాఫు సరస్సు ఒకటి కావడం గమనార్హం. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మో ఛు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఉన్న ప్రసిద్ధ గాసా త్షాచు వేడినీటి బుగ్గలకు సంబంధించిన మౌలిక వసతులు ఈ వరద తాకిడికి కొట్టుకుపోయాయి. అయితే ప్రమాదాన్ని ముందే ఊహించి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ వరద ధాటికి పునాఖా-గాసా హైవే దెబ్బతినడమే కాకుండా, ఈ ఏడాది ప్రారంభంలో నిర్మించిన సోలార్ ఇరిగేషన్ లిఫ్టింగ్ సిస్టమ్ కూడా పాక్షికంగా దెబ్బతిని పనిచేయడం ఆగిపోయింది.

Also Read : సూపర్ ఎల్‌నినో ముప్పు.. భారత్‌లో 55 వేల ప్రాణాలకు గండం?

భూటాన్‌లో సంభవించిన ఈ విపత్తు భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మేరకు భూటాన్ ప్రభుత్వం భారత అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, అలీపురద్వార్, జల్‌పైగురి, కూచ్ బెహార్ జిల్లాలతో పాటు అస్సాంలోని ధుబ్రి జిల్లాకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సంకోష్ నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీకి మరో ముప్పు.....

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల వణికించిన అర్నబ్ తుఫాను...

ఏపీ, తెలంగాణ.. సర్...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 6...

కష్టకాలంలో ఏపీకి అండగా...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ తీర...

సూపర్ ఎల్‌నినో ముప్పు.....

భారత్‌కు సూపర్ ఎల్‌నినో రూపంలో తీవ్రమైన...

చంద్రబాబుపై కయ్యానికి కాలు...

జూనియర్ ఎన్టీఆర్ మామ గారు చంద్రబాబుపై...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక...

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి...

పోల్స్