Sunday, October 19, 2025 12:01 PM
Sunday, October 19, 2025 12:01 PM
roots

చంద్ర బాబు ఇంత అవినీతి చేశాడా?

చంద్రబాబు గారిని విమర్శించే ప్రత్యర్థులందరూ సైతం ఏకీభవించే ఒకే ఒక్క మాట అన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ విజనరీ లీడర్ అని. ఇలా తను కున్న విజన్ తో హైదరాబాద్ డెవలప్మెంట్ ను ముందే పసిగట్టి. కొండాపూర్లో ఎకరాకు ₹25,000 లేని సమయంలో. అంతర్జాతీయంగా కంపెనీలు తెచ్చి ఆ కొండలు గుట్టలను ఒక శిల్పిలా చెక్కి దాన్ని బంగారం లా మార్చాడు. చంద్రబాబు తన కున్న విజన్ తో అప్పుడే కొన్ని 100 ఎకరాలు ముందే కొని ఉంటే ఇప్పుడు భారతదేశంలో సంపన్నుల జాబితాలో చంద్ర బాబు పేరు ఉండేది. కానీ అలా జరగలేదు. చంద్ర బాబు ఎప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు తప్ప అవినీతి కాదు. ఇలా అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన అవినీతి అయితే అవును చంద్రబాబు అవినీతి పరుడే.!

తెలంగాణ లో పాకిన బాంచన్ నీ కాల్మొక్త దొర అనే భావన సంపూర్ణంగా తొలగించి చంద్ర బాబు చేసిన అభివృద్ధి తో తమ కాళ్లపై వారు నిలబడి ఆత్మాభిమానంతో బతికేలా మార్పు తెచ్చిన చంద్రబాబు నాయుడు అవినీతి పరుడే.!

పూట గడవని రోజుల నుంచి వచ్చిన యువత సైతం నేడు చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్ల. లక్షలు సంపాదిస్తూ ఎంతోమంది పేద వారికి కడుపు నిండా అన్నం పెట్టేలా మార్చిన చంద్రబాబ అవినీతి పరుడే.!

హైదరాబాద్ అంటే ఎప్పుడు గుర్తుకు వచ్చేది పాతబస్తీ అల్లర్లు. మనిషిని మార్చే శక్తి ఒక్క చదువుకే ఉంటుంది. అలాంటి చదువు సైతం ఇష్టపడని పాతబస్తీ మైనారిటీలు చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్ల ఇప్పుడు చదువుకుంటూ, చదువు లేని వారు సైతం నెలకు 50 వేలకు పైగా సంపాదిస్తున్నారు. ఇలా హైదరాబాదులో మైనారిటీ యువత డబ్బు కోసం గొడవలు పడే స్థాయి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే స్థాయికి ఎదిగారు అంటే దానికి కారణం చంద్రబాబు చేసిన అభివృద్ధి. ఇలా మైనారిటీల జీవితాలు సైతం మార్చిన చంద్రబాబు అవినీతి పరుడే.!

రాజకీయ కక్షలో భాగంగా 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 20 కి పైగా కేసులు పెట్టి చంద్ర బాబు చేసిన అభివృద్ధి ని బయటపెట్టారు తప్ప అవినీతి కాదు. ఇప్పుడు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కి రాగానే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ని బయటపెట్టారు. కానీ అవినీతి కాదు. ఈ విధంగా కేసులు పెట్టి వేధిస్తున్న, దాడులు చేస్తున్నా, జైల్లో పెట్టిన, తన 73 సంవత్సరాల వయసులో కూడా ప్రజల కు ఇంకా ఏదో చేయాలని పోరాడుతున్నా డు కదా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడే.!

వంటింట్లో ఉండే ఆడ వాళ్లు సైతం ఇప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్ల కంపెనీలో లక్షలు సంపాదిస్తూ ఒకరి మీద కాదు. తన కాళ్ల మీద తాను నిలబడుతున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్లనే. అయినా చంద్రబాబు అవినీతి పరుడే.!

సంక్షోభం లో అవకాశాలు సృష్టించు కుంటూ రాష్ట్ర విభజన తర్వాత ఏమీ లేని AP లో తన కున్న తెలివి తో 2014 నుండి 2019 మధ్య AP ను సమాంతరంగా అభివృద్ధి చేయాలని రాయలసీమ లో పరిశ్రమలు తెచ్చి అక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించి రాయలసీమను పరిశ్రమల రాజధానిగా, ఉత్తరాంధ్ర లో వలసలను రూపుమాపాలని వైజాగ్ ను IT కాపిటల్ సిటీగా, ఫార్మా క్యాపిటల్ సిటీ గా, టూరిజం క్యాపిటల్ సిటీ గా, ఫిల్మ్ ఇండస్ట్రీ సిటీగా ఇలా ఉత్తరాంధ్ర ను ఆర్థిక రాజధానిగా. మరియూ ఇటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రజలకు పాలన సమాంతర దూరంలో ఉండాలని విజయవాడ, గుంటూరులను పరిపాలన రాజధాని గా చేయాలని, ఇలా అన్ని ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చేయాలనుకోవడం చంద్రబాబు చేసిన అవినీతి అయితే అవును అవినీతి పరుడే.!

చివరకు 6,00,000 కోట్ల అవినీతి ని పుస్తకాలు వేసి మరి నేడు అధికారంలో కి వచ్చిన తర్వాత 4 1/2 ఏళ్ల లో ఏమీ చేయలేక ఒకసారి 500 లు కోట్లు అని ఇంకోసారి ₹371, కోట్లు అని చివర కు 27 కోట్లు అవినీతి అని ప్రజల కు చూపించే ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న పుడు కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయినా తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి కి పాల్పడ లేదు. అలాంటి ది ఇప్పుడు ఈ 73 ఏళ్ల వయసు లో కేవలం 27 కోట్ల అవినీతి మాత్రమే చేశాడు. అంటే ఎవరైనా నమ్ముతారా.!
అయినా కొన్ని కులపిచ్చి కళ్ళకు చంద్ర బాబు ఎప్పుడూ అవినీతి పరుడే! కాకపోతే వాళ్ళు అవినీతి బురదలో దొర్లుతూ. చంద్రబాబు కూడా అవినీతి పరుడుగా చిత్రికరిస్తున్నారు.
ఇక వాళ్ల కళ్లలో ఆనందం కోసమైనా చంద్రబాబు అవినీతి పరుడుగానే ఉండాలి.

ప్రజలకు నీ గురించి బాగా తెలుసయ్యా. నువ్వు చేసిన అభివృద్ధి రుచి చూసిన ప్రజలకు నువ్వు ఎంత పెద్ద నాయకుడో తెలుసు నువ్వు అవినీతిపరుడు కాదు అభివృద్ధి పరుడు అని.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్