ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని కంచుకోటగా ఉన్న పులివెందుల గడ్డపై తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవాలతో ప్రభంజనం సృష్టించారు. నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుని వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Also Read : షర్మిలకి అండగా లోకేష్.. సంచలన ట్వీట్..!
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏకంగా 64 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా నియోజకవర్గంలోని మొత్తం 7 జడ్పీటీసీ స్థానాలకు గానూ 3 స్థానాలను ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుని క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేసింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు కనీసం నామినేషన్ల బరిలో నిలబడలేకపోవడం లేదా చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఈ ఏకగ్రీవాలు ఖరారయ్యాయి.
Also Read : ఒంగోలు పార్లమెంట్ లో తేలిన కూటమి పంచాయితీ..!
ముఖ్యంగా నియోజకవర్గంలోని కీలక మండలాల్లో కూటమి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. వేంపల్లి మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గానూ 17 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లగా.. వేముల మండలంలోని మొత్తం 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారు. జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీ క్యాడర్ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లోనే అతిపెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయంతో పులివెందులపై కూటమి పట్టు సాధించిందని ఎన్డీఏ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Also Read : ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. జగన్ ఫ్యామిలీ రాజ్యాంగం
పులివెందుల నియోజకవర్గంలోని ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి భారీగా ఏకగ్రీవ విజయాలు సాధించింది. వేంపల్లి మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో టీడీపీ 15 స్థానాలను దక్కించుకోగా, బీజేపీ, జనసేన చెరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అల్లిరెడ్డిపల్లె ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరగనుంది. ఇక వేముల మండలంలోని 8, చక్రాయపేట మండలంలోని 9, తొండూరు మండలంలోని 8, సింహాద్రిపురం మండలంలోని 8, లింగాల మండలంలోని 9, పులివెందుల మండలంలోని 5 ఎంపీటీసీ స్థానాలన్నింటిలోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


