Saturday, October 24, 2026 08:33 PM
Saturday, October 24, 2026 08:33 PM

ఉమ్మడి ఆస్తిని నాది అనడం.. షర్మిలకి అన్యాయం చేయడం కాదా?

మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య నెలకున్న విభేదాలు, మేనకోడలు వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనని మొండికేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ రాసిన లేఖని విశ్లేషిస్తే.. ఆయన విపరీత మనస్తత్వం బయటపడుతుంది. వివాహ పత్రికలో యలహంక ప్యాలెస్ లోని నా నివాసంలో పెళ్ళి అని అచ్చేయడం జగన్ కి నచ్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏడేళ్లుగా మన మధ్య గొడవలు.. అంటే 2019.. అంటే చెల్లిని 3,000 కిమీ లు నడిపించి.. సీఎం పదవి కొట్టేశారు జగన్.. పాదయాత్ర వల్ల చెల్లి కాలుకి సర్జరీ కూడా అయ్యింది.

Also Read : షర్మిలకు జగన్ వివాదాస్పద లేఖ..!

అయినా అవసరం తీరాక చెల్లిని బయటికి గెంటేసారు. ⁠యలహంకలో నా ఇల్లు అంటున్నాడు.. ఉమ్మడి ఆస్తిని నా ఇల్లు అని ఎలా అంటాడో ఆయనకే తెలియాలి. వైఎస్ హయాంలో చెల్లి షర్మిల, భర్త అనిల్, పిల్లలతో అక్కడే నివాసం ఉండేవారు. హైదరాబాద్ ⁠లోటస్ పాండ్ లో నా ఇల్లు అంటున్నాడు.. అంటే అది కూడా దొబ్బేసాడు. ⁠నేను బెంగళూరు లోనే నివసిస్తున్నాను.. ఓహో అంటే జనం అనుకునేది కరెక్ట్.. నువ్వు ఏపీకి గెస్ట్ పొలిటీషియన్ అన్నది అక్షరాలా నిజం అన్న మాట ఆయనే ఒప్పేసుకున్నాడు. ⁠నా ప్యాలెస్ లోకి క్యాటరింగ్ వాళ్ళు, పూలు అలంకరించే వాళ్ళు, వీడియోగ్రాఫర్స్, పెళ్లి సిబ్బంది లాంటి సామాన్యులకు లోపలికి ప్రవేశం లేదు.. అంటే వీళ్ళని మనుషులుగా కూడా చూడడా జగన్.

Also Read : బాక్సాఫీస్ ను దున్నేస్తున్న సీనియర్ హీరోలు..!

ఓట్లు వేయడానికి వాళ్ళు కావాలి. వాళ్ళ వృత్తిని అవమానిస్తున్నాడు. వాళ్ళు వస్తే తన భద్రతకు ముప్పు అంటున్నాడు. అంటే వాళ్లంతా హంతకులా? ఇది పెత్తందారు నిజ స్వరూపం కాదా? రాజకీయ ప్రయాణాలు వేర్వేరు అయినప్పటికీ, రక్తసంబంధం ఉన్న తోబుట్టువుల మధ్య దూరం పెంచడం మంచిది కాదు. ఆమెని మానసికంగా హింసించడం… తండ్రి ఇచ్చిన ఆస్తిని ఆమెకి ఇవ్వకపోవడాన్ని ఏమనాలి? కుటుంబ భద్రత, గోప్యత కావాలంటే పెళ్ళి జరిగే టైంలో అటు హైదరాబాద్ లోటస్ పాండ్ కో, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లిపోవచ్చు కదా. సొంత మేనకోడలు పెళ్ళికి ఇన్ని కొర్రీలు పెట్టే మేనమామ బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండడు అంటున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

షర్మిలకు జగన్ వివాదాస్పద...

బెంగళూరులోని వైయస్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక...

లోపల అసంతృప్తి.. పైకి...

కొందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అధికారిక...

కారు పార్టీలో అంతర్గత...

కారు పార్టీలో అంతర్గత విభేదాలు.. ఆధిపత్య...

జగన్ పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

రెబల్స్‌పై టీడీపీ సర్జికల్...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

ఏపీ పరిషత్ సమరం.....

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల...

పోల్స్