భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మారుతి సుజుకి తన పాపులర్ ఎస్‌యూవీ విక్టోరిస్ మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సరికొత్త విక్టోరిస్ ఔరమ్ ఎడిషన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. లాటిన్ భాషలో ఔరమ్ అంటే బంగారం అని అర్థం. మొదటి సంవత్సరంలోనే ఈ ఎస్‌యూవీ సాధించిన అద్భుతమైన సేల్స్ విజయానికి ప్రతీకగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ యాక్సెసరీస్ కిట్ ధరను రూ. 22,990గా నిర్ణయించారు.
Also Read : ఏపీ పరిషత్ సమరం.. కూటమి సీట్ల పంచాయితీ తేలినట్లే..?
ఈ ఔరమ్ ఎడిషన్‌లో కారు వెలుపల, లోపల పలు ఆకర్షణీయమైన కాస్మెటిక్ మార్పులు చేశారు. కారు ముందు, పక్క భాగాల్లో మరియు వెనుక స్కిడ్ ప్లేట్లు, వీల్ అర్చెస్ వద్ద సరికొత్త కాపర్ కలర్ ఇన్‌సెర్ట్స్‌ను జోడించారు. ఫ్రంట్ గ్రిల్, బంపర్స్, ఫెండర్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్, డోర్ వైజర్లపై విలాసవంతమైన క్రోమ్ యాక్సెసరీలను అమర్చారు. అలాగే కారు లోపల అన్ని కాలాలకు అనుకూలంగా ఉండే ఆల్-వెదర్ 3D క్యాబిన్ మ్యాట్స్, 3D బూట్ మ్యాట్, రియర్ ట్రంక్ సిల్ గార్డ్‌ను ఈ కిట్ ద్వారా అందిస్తున్నారు.
Also Read : జగన్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్..!
ఈ ఔరమ్ ఎడిషన్ ప్రధానంగా విక్టోరిస్ ఎస్‌యూవీ యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై ఆధారపడి రూపొందించబడింది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్, లిథియం-అయాన్ బ్యాటరీ కలయిక ఉంటుంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌తో పనిచేస్తూ దాదాపు 116 హెచ్‌పి పవర్, 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, సాధారణ విక్టోరిస్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 10.50 లక్షల నుండి టాప్ ఎండ్ ధర రూ. 19.99 లక్షల వరకు ఉంది. ఈ సరికొత్త ఔరమ్ ఎడిషన్ ప్రచారానికి బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతి సుజుకి రంగంలోకి దించింది.


