Friday, October 9, 2026 11:54 AM
Friday, October 9, 2026 11:54 AM

హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కలలకు బ్రేక్..?

ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి గ్లోబల్ కంపెనీలతో పాటు టాటా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ వంటి 8 ప్రముఖ ఐటీ సంస్థల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, యూఎస్ యాంటీ-ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ సమక్షంలో అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. వీసా ప్రోగ్రామ్‌లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడం, స్థానిక అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Also Read : టీడీపీకి తలనొప్పిగా అనంతపురం ఎమ్మెల్యే..!

ఈ సంచలన నిర్ణయం వల్ల సదరు 8 కంపెనీల నుండి ఎలాంటి కొత్త PERM దరఖాస్తులను అమెరికా కార్మిక శాఖ స్వీకరించదు. దీనితో పాటు, ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఒకవైపు స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, మరోవైపు విదేశీ కార్మికులను తక్కువ జీతాలకు నియమించుకుంటున్నాయనే ఆరోపణలపై ఫెడరల్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ విధించడం గమనార్హం. అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తూ, అక్కడ గ్రీన్ కార్డ్ పొందాలనుకునే విదేశీయులకు ‘PERM’ సర్టిఫికేషన్ అనేది మొదటి, అత్యంత కీలకమైన అడుగు.

Also Read : గాల్లోనే విమానంపై పడ్డ పిడుగు.. లక్నోలో ఏం జరిగింది..?

ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో సదరు 8 కంపెనీలలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కలలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ముఖ్యంగా అమెరికాలోని భారత ఐటీ నిపుణులు ఈ నిర్ణయం వల్ల తీవ్ర ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే, ఈ సస్పెన్షన్ నిర్ణయం వల్ల ప్రస్తుతం హెచ్-1బీ వీసాలపై అమెరికాలో కొనసాగుతున్న ఉద్యోగులకు ఎలాంటి తక్షణ ముప్పు లేదు. వారి ప్రస్తుత వీసాలు రద్దు కావు. అలాగే ఇప్పటికే గ్రీన్ కార్డ్ ప్రక్రియ పూర్తి చేసుకుని కార్డ్‌లు పొందిన వారిపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపదు. ఇది కేవలం భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోబోయే కొత్త దరఖాస్తుదారులకు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న PERM అప్లికేషన్లకు మాత్రమే వర్తిస్తుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

టీడీపీకి తలనొప్పిగా అనంతపురం...

అధికారంలో ఉన్న టీడీపీకి.. అనంతపురం అర్బన్...

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

పోల్స్