Friday, October 9, 2026 01:13 PM
Friday, October 9, 2026 01:13 PM

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల దూరం..? వైసీపి నేతలకు జగన్ కీలక ఆదేశాలు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీలో నంబర్-2 స్థానంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్‌కు కాస్త దూరంగా ఉంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా ఉన్నప్పటికీ.. గతంలో లాగా తాడేపల్లి వేదికగా జరిగే కీలక వ్యవహారాల్లో సజ్జల ప్రమేయం క్రమంగా తగ్గుతూ వస్తోందని వైసీపీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read : ఉత్తరాంధ్రలో ఊడుతున్న రెక్కలు.. జగన్ పై నమ్మకం పోతుందా..?

ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ నేతలు ఎవరితోనూ సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా మాట్లాడకూడదని, రాజకీయ లేదా పార్టీ వ్యవహారాలపై చర్చలు జరపవద్దని జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సజ్జల శైలి పట్ల, ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అసంతృప్తితో ఉన్నారని, ఈ మేరకు జగన్‌కు పలువురి నుండి గట్టిగానే ఫిర్యాదులు వెళ్లాయని టాక్. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే నేతలతో సజ్జల ఇన్వాల్వ్‌మెంట్‌ను జగన్ తగ్గించారనే ప్రచారం జరుగుతోంది.

ముఖ్య నేతలతో లేదా పార్టీ క్యాడర్‌తో మాట్లాడాలి అంటే తానే స్వయంగా మాట్లాడతానని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకోసమే తాను తాడేపల్లి వచ్చినప్పుడు నాయకులను కలవడం, లేని పక్షంలో కీలక నేతలను నేరుగా బెంగళూరుకు పిలిపించుకుని భేటీ అవ్వడం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. పార్టీ కీలక చర్చలు, భవిష్యత్ వ్యూహాలు ఇప్పుడు తాడేపల్లి కంటే ఎక్కువగా బెంగళూరు వేదికగా మారుతుండడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Also Read : ఇది జగన్ వ్యూహమా? రాజకీయ గందరగోళమా?

గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన జగన్, క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సజ్జల వల్లే గతంలో చాలా మంది నేతలకు, అధినేతకు మధ్య గ్యాప్ వచ్చిందనే వాదన బలంగా వినిపించడంతో.. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా జగన్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. చాలా మంది నేతల కంప్లైంట్ వల్లే సజ్జలను యాక్టివ్ పాలిటిక్స్, అంతర్గత చర్చల నుంచి కాస్త పక్కన పెట్టి, లీగల్ సెల్ వంటి పరిమిత బాధ్యతలకే పరిమితం చేశారనే యాంగిల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

టీడీపీకి తలనొప్పిగా అనంతపురం...

అధికారంలో ఉన్న టీడీపీకి.. అనంతపురం అర్బన్...

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

పోల్స్