Friday, October 9, 2026 01:16 PM
Friday, October 9, 2026 01:16 PM

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఏపీ హైకోర్టు గతంలో ఆదేశించిన ఆరు వారాల గడువులోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం విన్నవించడంతో, స్థానిక పోలింగ్ ప్రక్రియకు న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. ఎన్నికల నిర్వహణతో పాటు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా వినియోగంపై ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Also Read : తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల దూరం..? వైసీపి నేతలకు జగన్ కీలక ఆదేశాలు..!

నోటిఫికేషన్ వెలువడే సమయానికి ప్రత్యేక ఓటర్ల జాబితా పునరీక్షణ ప్రక్రియ పూర్తయినట్లయితే, రూపుదిద్దుకున్న నూతన ఓటర్ల జాబితా ప్రాతిపదికన మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
ఒకవేళ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి ఈ S.I.R ప్రక్రియ ముగియని పక్షంలో, ఆ నెపంతో ఎన్నికల నిర్వహణను నిలిపివేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అటువంటి పరిస్థితిలో అందుబాటులో ఉన్న మునుపటి లేదా పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసుకోవచ్చని న్యాయస్థానం ఆదేశించింది.

Also Read : హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కలలకు బ్రేక్..?

సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రాష్ట్రంలో స్థానిక సమరానికి రంగాన్ని సిద్ధం చేయడానికి ఎన్నికల సంఘం సన్నాహాలు వేగవంతం చేసింది. హైకోర్టు నిబంధనల ప్రకారం ఆరు వారాల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో, ఏపీ రాజకీయ వర్గాల్లో పల్లె, పట్టణ పోరుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఎన్నికల సంఘం కూడా ఫిబ్రవరిలో ఉన్న ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. ఇక పార్టీల పరంగా రిజర్వేషన్లను అమలు చేసే అంశానికి సంబంధించి కూటమి పార్టీలు రెండు రోజుల్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

టీడీపీకి తలనొప్పిగా అనంతపురం...

అధికారంలో ఉన్న టీడీపీకి.. అనంతపురం అర్బన్...

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

పోల్స్