Thursday, October 8, 2026 03:12 PM
Thursday, October 8, 2026 03:12 PM

మరి షమీ, సిరాజ్ సంగతేంటి.? అసలు మీ ప్లాన్ ఏంటి..?

సీనియర్ క్రికెటర్ల విషయంలో.. సెలెక్టర్ల తీరుపై టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ వసీం జాఫర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22 నుండి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం సీనియర్ స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి జట్టులోకి ఎంపిక చేయడంపై స్పందించిన జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. భువీని జట్టులోకి తీసుకోవడాన్ని స్వాగతించిన జాఫర్, అదే సమయంలో జట్టు మేనేజ్‌మెంట్ అనుసరిస్తున్న బౌలింగ్ వ్యూహాలపై అసంతృప్తి వ్యక్తం చేసాడు.

Also Read : పాపం వైసీపీ.. ఆ 70 నియోజకవర్గాల పరిస్థితి ఏమిటో..?

భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి ఎంపిక చేయడంపై వసీం జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. “ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. భువీని ఎంపిక చేసి సెలెక్టర్లు ఎవరికీ పెద్ద ఉపకారం చేయలేదు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున అతను నిలకడగా రాణిస్తున్నాడు, ఫిట్‌నెస్ కూడా అద్భుతంగా ఉంది. మరి ఇంతకాలం అతన్ని ఎందుకు పక్కన పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. వయస్సును పక్కన పెట్టి, ఒత్తిడి సమయాల్లో జట్టును ఆదుకునే అనుభవజ్ఞులైన ఆటగాళ్లను ప్రోత్సహించాలి” అని హితవు పలికాడు.

Also Read : రాజకీయాల్లోకి యంగ్ హీరో శివకార్తికేయన్..?

ఇదే సమయంలో స్టార్ బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడంపై జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. “జట్టులో జస్ప్రీత్ బుమ్రా తర్వాత రెండవ, మూడవ ప్రధాన ఫాస్ట్ బౌలర్లు ఎవరో సెలెక్టర్లకే స్పష్టత లేదు. సిరాజ్‌కు నిలకడగా మ్యాచ్‌లు ఆడించట్లేదు. 2027 వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతున్న తరుణంలో క్వాలిటీ ఉన్న షమీని వన్డే, టెస్టు జట్టులోకి వెంటనే తీసుకురావాలి. ఒకవేళ ఇప్పుడు కూడా షమీని విస్మరిస్తే, ఇక అతని అంతర్జాతీయ కెరీర్ క్లోజ్ అయినట్లే భావించాలి” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పిఠాపురంలో ఏం జరుగుతోంది..?...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత...

విజయనగరంలో వైసీపీ మెయిన్...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం...

పోల్స్