Thursday, October 8, 2026 03:12 PM
Thursday, October 8, 2026 03:12 PM

ఉత్తరాంధ్రలో ఊడుతున్న రెక్కలు.. జగన్ పై నమ్మకం పోతుందా..?

ఉత్తరాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. విజయనగరంలో కీలక నేత చిన్న శ్రీను పార్టీ మారిన తర్వాత.. గ్రౌండ్ లెవెల్‌లో వైసిపి కోలుకోలేని దెబ్బతింటోంది. ఆయన బాటలోనే నడిచేందుకు జిల్లాలోని మెజారిటీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం సిద్ధమై పార్టీ మారిపోయారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన క్యాడర్ అంతా టీడీపీ వైపు మొగ్గు చూపుతుండటంతో విజయనగరం వైసిపి కోట దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read : విజయనగరంలో వైసీపీ మెయిన్ వికెట్ డౌన్.. ఇప్పుడు జనసేన వంతు..!

ఈ వలసల ప్రభావం కేవలం విజయనగరానికే పరిమితం కాకుండా, పొరుగు జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళంపై కూడా తీవ్రంగా పడుతోంది. విజయనగరం పరిణామాలను గమనిస్తున్న ఈ రెండు జిల్లాల కీలక నేతలు కూడా వరుసగా సైకిల్ ఎక్కేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర మొత్తం ఒకేసారి కీలక నాయకత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడటంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు వైసీపీలో కీలకంగా ఉన్న నాయకులు అందరూ పార్టీ మారిపోయే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Also Read : రాజకీయాల్లోకి యంగ్ హీరో శివకార్తికేయన్..?

గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మిన ఉత్తరాంధ్ర నేతలు.. ఇప్పుడు ఆ స్థాయిలో నమ్మలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయ మనుగడను దృష్టిలో ఉంచుకునే నేతలంతా వరుసగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అటు ఖర్చు కూడా పెరిగిపోవడం పార్టీ నేతలను కలవరపెడుతోంది. మొత్తానికి చిన్న శ్రీను ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రలో వైసిపి ఫ్యాన్ రెక్కలు పూర్తిగా ఊడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పిఠాపురంలో ఏం జరుగుతోంది..?...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత...

విజయనగరంలో వైసీపీ మెయిన్...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం...

పోల్స్