Wednesday, October 7, 2026 06:19 PM
Wednesday, October 7, 2026 06:19 PM

ఉక్రెయిన్ – రష్యా వార్.. భారత్ కు సరికొత్త తలనొప్పి..!

రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా నల్లసముద్రం ప్రాంతంలో జరిగిన ఒక భీకర డ్రోన్ దాడిలో భారత నావికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ పర్యాటక నగరమైన సోచి తీరానికి సమీపంలో లైబీరియా ఫ్లాగ్‌తో వెళ్తున్న ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ నావికాదళ డ్రోన్లు దాడికి తెగబడ్డాయి. ఈ ఆయిల్ ట్యాంకర్‌లో మొత్తం 23 మంది భారతీయ నావికులు సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు.

Also Read : పిఠాపురంలో ఏం జరుగుతోంది..? ఎంపీపై జనసేన నేతల సంచలన ఆరోపణలు..!

డ్రోన్ దాడి జరిగిన వెంటనే సముద్రంపై ఉన్న ఆ ట్యాంకర్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆకాశాన్ని తాకేలా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న రష్యా రవాణా మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. అదృష్టవశాత్తూ ఓడలోని 23 మంది భారత సిబ్బందిని సురక్షితంగా రక్షించగలిగారు, అయితే ఈ ప్రమాదంలో ఒక భారత నావికుడికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్‌లో ముడిచమురు దహనమవుతూ మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, వాటిని అదుపు చేయడం రష్యన్ అగ్నిమాపక సిబ్బందికి కష్టతరంగా మారింది.

Also Read : ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్..!

మంటల తీవ్రత తగ్గిన తర్వాతే పూర్తిగా ఆర్పేందుకు ప్రయత్నిస్తామని రష్యా అధికారులు తెలిపారు. నల్లసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ఒకరోజు ముందే రొమేనియా తీరంలో మరో నౌక ప్రమాదానికి గురై మునిగిపోయింది. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు కూడా నల్లసముద్రంలో వాణిజ్య రవాణాను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. తమ నగరాలపై దాడులకు నిరసనగా తాము రష్యా చమురు మౌలిక వసతులపై దాడులు చేస్తున్నట్లు ఉక్రెయిన్ సమర్థించుకుంటోంది. రెండు దేశాలు తమ దాడులను మరింత ఉధృతం చేయడంతో, ఈ మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న వందలాది మంది భారత నావికుల భద్రత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పిఠాపురంలో ఏం జరుగుతోంది..?...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత...

విజయనగరంలో వైసీపీ మెయిన్...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం...

ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్...

ఫ్రాన్స్‌లో విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరత...

అందరి దృష్టి అక్టోబర్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై...

నవంబర్ నుంచి పెన్షన్‌లో...

ఏపీలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్‌ తగ్గుతుందా..?...

పోల్స్