Wednesday, October 7, 2026 05:00 PM
Wednesday, October 7, 2026 05:00 PM

పిఠాపురంలో ఏం జరుగుతోంది..? ఎంపీపై జనసేన నేతల సంచలన ఆరోపణలు..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని జనసేన పార్టీలో అంతర్గత గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో జనసేన నాయకులు నిర్వహించిన ఒక మీడియా సమావేశం కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి, తీవ్ర రచ్చగా మారింది. పార్టీలోని నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంతో బహిర్గతమయ్యాయి. ఒకరిపై ఒకరు పరస్పరం తీవ్రస్థాయిలో దూషణలకు దిగడంతో ఈ ప్రెస్‌మీట్ కాస్తా వివాదాస్పదంగా మారింది.

Also Read : విజయనగరంలో వైసీపీ మెయిన్ వికెట్ డౌన్.. ఇప్పుడు జనసేన వంతు..!

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు జనసేన సీనియర్ నేతలు, కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఒంటెద్దు పోకడల వల్లే పిఠాపురంలో జనసేన పార్టీ తీవ్రంగా నష్టపోతోందని, పార్టీ ఉనికి సర్వనాశనం అవుతోందని కొందరు నాయకులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్‌ను సమన్వయం చేయడంలో ఎంపీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

Also Read : ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్..!

అంతేకాకుండా, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు గానీ, లేదా స్థానికంగా పార్టీ పరమైన కీలక సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించినప్పుడుగానీ తమకు ఎలాంటి కనీస సమాచారం ఇవ్వడం లేదని సీనియర్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమను కావాలనే పక్కన పెడుతున్నారని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోనే, అది కూడా మీడియా సమక్షంలోనే నాయకులు ఇలా వీధికెక్కడం, ఎంపీపై బహిరంగంగా ధ్వజమెత్తడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రూపు తగాదాలు, విభేదాల వ్యవహారంపై జనసేన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

విజయనగరంలో వైసీపీ మెయిన్...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం...

ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్...

ఫ్రాన్స్‌లో విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరత...

అందరి దృష్టి అక్టోబర్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై...

నవంబర్ నుంచి పెన్షన్‌లో...

ఏపీలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్‌ తగ్గుతుందా..?...

మిషన్ 2027 వరల్డ్...

భారత క్రికెట్ జట్టులోకి దాదాపు నాలుగేళ్ల...

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో...

పోల్స్