Monday, October 5, 2026 07:31 PM
Monday, October 5, 2026 07:31 PM

రాయలసీమలో చంద్రబాబు మార్క్.. డ్రిప్‌ ఇరిగేషన్‌ నుంచి హార్టీకల్చర్ హబ్‌ వరకు

తరతరాల నుంచి కరువు సీమ, కష్టాల సీమగా ఉన్న రాయలసీమ రాత మారుతోంది. రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం నుంచి పుట్టిన హార్టీకల్చర్ హబ్‌ ప్రాజెక్టు అట్టహాసంగా ప్రారంభమైంది. సీమను సస్యశ్యామలం చేయడానికి సీఎం చంద్రబాబు మూడు దశాబ్దాల నుంచి అలుపెరగని కృషి చేస్తూనే ఉన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సీమలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం.

Also Read : అంబటి ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!

ఇజ్రాయెల్‌ దేశంలో విజయవంతంగా అమలు చేస్తున్న డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని మన రాయలసీమలో ప్రవేశపెట్టాలని భావించారు సీఎం చంద్రబాబు. ఈ పద్ధతిలో తక్కువ నీటితో మంచి పంటలు పండుతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి.. డ్రిప్‌ ఇరిగేషన్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ అందించారు. 2023 నవంబర్‌లో ప్రారంభమైన ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు రాయలసీమ ప్రస్థానాన్ని మార్చివేసింది. ఉద్యాన పంటల సాగులో రాయలసీమ నంబర్‌ వన్ పొజిషన్‌లో ఉండటానికి డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానమూ ఒక కారణం.

2014లో మూడోసారి సీఎం పదవి చేపట్టిన తర్వాత.. హంద్రీ నీవా సుజల స్రవంతిలో కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పాటు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలపై సబ్సిడీ ఎత్తేసింది. 2024లో జగన్‌ దిగిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీమలో సాగుకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి.

Also Read : బొత్సను ఒంటరిని చేస్తున్న మేనల్లుడు..!

హంద్రీనీవా సుజల స్రవంతిలో పెండింగ్‌ పనులు పూర్తి చేయడం ద్వారా సీఎం చంద్రబాబు కుప్పం వరకు కృష్ణా జలాలను తరలించారు. కేంద్ర ప్రభుత్వ సహాకారం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో లక్ష కోట్ల రూపాయల హార్టీకల్చర్ హబ్‌ ప్రాజెక్టుని ప్రారంభించారు. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను ఏర్పాటు చేసి.. వ్యవసాయాన్ని డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించి హైటెక్‌ పంటలు పండించే ప్రణాళిక సిద్ధం చేశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌తో ఒక్కో బొట్టుతో ప్రారంభమైన రాయలసీమ అభివృద్ది.. ఇప్పుడు ఉద్యానహబ్‌తో అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రంగా డెవలప్‌ అవుతోంది. ఈ అభివృద్ధి ప్రస్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

గవర్నర్ కోటా పైనే...

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల...

అంబటి ఓవరాక్షన్.. పోలీసుల...

దివంగత కాపు ఉద్యమ నేత, మాజీ...

బొత్సను ఒంటరిని చేస్తున్న...

ఉత్తరాంధ్ర రాజకీయ ఖిల్లా విజయనగరం జిల్లా...

అన్నదమ్ములకు అసలైన పరీక్ష..!

సాధారణంగా ఒకే పార్టీలోనే ఇద్దరు నాయకుల...

పవన్, లోకేష్ మధ్య...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

పోల్స్