Monday, October 5, 2026 06:51 PM
Monday, October 5, 2026 06:51 PM

గవర్నర్ కోటా పైనే హస్తం కన్ను..!

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. మూడు స్థానాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడక ముందే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీ ముఖ్య నేతలతో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా లాబీయింగ్ మొదలైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు నేతలు ఇప్పటికే.. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరినట్లు ప్రచారం. అలాగే పీసీసీ అధ్యక్షుడితో కూడా సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు తమకు అవకాశం దక్కేలా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఎంపికలో సామాజికవర్గాల సమీకరణలు కీలకంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి సామాజికవర్గానికి కేటాయించిన నేపథ్యంలో.. గవర్నర్ కోటాలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : బొత్సను ఒంటరిని చేస్తున్న మేనల్లుడు..!

మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీ సామాజికవర్గాలకు కేటాయించే అంశంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే నేతలను ఎంపిక చేయాలనే ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే హస్తం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. పద్మశాలి సామాజికవర్గానికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో కీలక ప్రకటన చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్ల సభ వేదికగా సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పద్మశాలి సామాజికవర్గానికి దక్కే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది.

మరో ఎమ్మెల్సీ స్థానాన్ని ముదిరాజు సామాజికవర్గానికి కేటాయించే అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ముదిరాజు సామాజికవర్గం గణనీయమైన జనాభాను కలిగి ఉండటంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముదిరాజు కోటాలో మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మధు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ముఖ్య నేతలను కలిసి ఎమ్మెల్సీ అవకాశం కోసం తన ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఎంపీ ఎన్నికల తర్వాత నీలం మధుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : రాజధాని రైతులకు మరో మినహాయింపు

మూడు స్థానాల్లో మూడో సీటును రెడ్డి సామాజికవర్గానికి కేటాయించే పరిస్థితి వస్తే ఆర్టీఐ కమిషనర్ అయోధ్యా రెడ్డి పేరు కూడా రేసులోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కాంగ్రెస్ పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీస్తోంది. అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజికవర్గాల ప్రాతినిధ్యం, పార్టీ విధేయత, రాజకీయ సమీకరణాలు.. ఈ అంశాల ఆధారంగా తుది ఎంపిక ఉండే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆశావహుల జాబితాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

అంబటి ఓవరాక్షన్.. పోలీసుల...

దివంగత కాపు ఉద్యమ నేత, మాజీ...

బొత్సను ఒంటరిని చేస్తున్న...

ఉత్తరాంధ్ర రాజకీయ ఖిల్లా విజయనగరం జిల్లా...

అన్నదమ్ములకు అసలైన పరీక్ష..!

సాధారణంగా ఒకే పార్టీలోనే ఇద్దరు నాయకుల...

పవన్, లోకేష్ మధ్య...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

పోల్స్