Monday, October 5, 2026 02:30 PM
Monday, October 5, 2026 02:30 PM

అన్నదమ్ములకు అసలైన పరీక్ష..!

సాధారణంగా ఒకే పార్టీలోనే ఇద్దరు నాయకుల మధ్య పొసగని పరిస్థితి ఉంటుంది. రాజకీయాలు అంటే అంతే మరి. అలాంటిది వేరు వేరు పార్టీలు. అలాగే లక్ష్యాలు, ఆకాంక్షలు కూడా ఒకటే అయినపుడు.. వారిద్దరి మధ్య పోటీ ఉన్నపుడు కచ్చితంగా పొరపొచ్చాలు అనేవి వస్తాయి. అది సహజం కూడా. కానీ విచిత్రంగా ఏపీలో అధికార కూటమిలో ఉన్న మిత్రపక్షాల మధ్య భేదాలు అయితే ఎక్కడా తలెత్తడం లేదు. అధికారంలోకి వచ్చాక ఉండే ఆధిపత్య పోరు కానీ రాజకీయ తీరు కానీ అసలు కనిపించడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం – జనసేన పార్టీల మధ్య బంధం మరింత పటిష్టంగా ఉందని గుర్తు చేస్తున్నారు.

Also Read : ఫ్లై దుబాయ్ విమాన ఘటన విచారణలో భయంకర నిజాలు..!

నారా లోకేష్ అయితే పవన్‌ని చూసి అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారు. పవన్ సైతం అంతే అభిమానంగా అలింగనం చేసుకుంటారు. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రానికి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి వచ్చిన పవన్‌ని లోకేష్ రిసీవ్ చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరూ ఎంతో అభిమానంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత వేదిక మీద కూడా ఇద్దరూ సరదాగా గడిపారు. ఈ సన్నివేశాలు చూసిన వారు టీడీపీ – జనసేనల మధ్య గ్యాప్ ఉందంటే అసలు అంగీకరించే ప్రసక్తి లేదని అంటున్నారు. అంతే కాదు ఇటీవల కాలంలో పవన్‌కి నారా లోకేష్‌కు మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు కూడా చెక్ పెట్టేలా ఈ ఇద్దరి సాన్నిహిత్యం ఉందని అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎనభై శాతం సీట్లకు పోటీ చేస్తుందని జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం సీట్లు కేటాయిస్తుందని లోకేష్ టీడీపీ సమావేశంలో అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇదంతా ఊహాగానాలే అని ఎంత చెప్పినా కూడా అది అలా వైరల్ అయింది. దీంతో జనసేన వర్గాలు కూడా అలర్ట్ అయ్యాయి. 30 శాతం సీట్లు తీసుకుంటామని పదే పదే ప్రకటించాయి. 2024 ఎన్నికల ఫార్ములా కాదు 2026 ఎన్నికల ఫార్ములానే అనుసరిస్తామని కూడా గట్టిగా చెబుతున్నాయి. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వాటా తేల్చుకోవాలని జనసేన చూస్తోందనే మాట కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కలిసి మెలిసి ఉండడంతో గ్యాప్ అనేది ఏదీ లేదంటున్నారు.

Also Read : పవన్, లోకేష్ మధ్య గ్యాప్ ఉందా.. నిజమేనా..?

అయితే నాయకుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు వేరు. అవి రాజకీయాలకు అతీతంగా కొనసాగవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు తమ లక్ష్యాలను కూడా చూసుకుంటాయంటున్నారు. అందువల్ల జనసేన కోరినట్లుగా 30 శాతం సీట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. అలా కనుక జరగకపోతే మాత్రం జనసేనలో అసంతృప్తి పెరుగుతుందని చెబుతున్నారు. అంతే కాదు పార్టీ క్యాడర్ కూడా డీ మోరలైజ్ అవుతుందని అంటున్నారు. అందువల్ల సీట్ల విషయంలోనే అన్నీ తెలుస్తాయని అంటున్నారు. తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అని ఒక సామెత ఉంది. దానినే అమలు చేయాలన్నది జనసేన కోరుకుంటోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా తమ డిమాండ్ మేరకు సీట్లు తీసుకుని పోటీ చేసినట్లు అయితే గ్రౌండ్ లెవెల్‌లో జనసేన బలపడుతుందని భావిస్తున్నారు. ఆ విధంగా జనసేనకు 30 శాతం సీట్లు దక్కితే కనుక పవన్, లోకేష్ అన్నదమ్ముల బంధం మరింతగా బలోపేతం అవుతుందని అంటున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బొత్సను ఒంటరిని చేస్తున్న...

ఉత్తరాంధ్ర రాజకీయ ఖిల్లా విజయనగరం జిల్లా...

పవన్, లోకేష్ మధ్య...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

పోల్స్