మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచడం ఇప్పుడు వైసీపీ అధిష్టానంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రూ.40 కోట్ల భారీ ఆర్థిక లావాదేవీల కోణంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి, ఈనెల 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించడంతో వైఎస్సార్సీపీ క్యాంప్‌లో ఒక్కసారిగా గుబులు మొదలైంది. సీబీఐ విచారణ ఒక కొలిక్కి వచ్చిందని భావిస్తున్న తరుణంలో, కేంద్ర ఆర్థిక దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి అస్సలు తగ్గడం లేదని, దర్యాప్తు ఫైళ్ళు వేగంగా కదులుతున్నాయని పార్టీ అంతర్గత వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read : అమలు లోకి కొత్త టోల్ రూల్స్.. వాళ్లకు ఫాస్ట్‌ట్యాగ్ ఉండదు..!
అయితే, ఈ సంక్షోభ సమయంలో వైసీపీని అన్నిటికంటే ఎక్కువగా వేధిస్తున్న ప్రధాన సమస్య.. ఢిల్లీలో పార్టీ తరఫున కేంద్ర పెద్దలతో మాట్లాడే సరైన లీడర్ లేకపోవడం. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన కీలక నేతలు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపడానికి, లేదా దర్యాప్తు సంస్థల దూకుడుకు బ్రేకులు వేసేలా పొలిటికల్ లాబీయింగ్ నడపడానికి జగన్ తరఫున ఢిల్లీ పెద్దలతో మాట్లాడే బలమైన గళం ప్రస్తుతం కనిపించడం లేదు.
Also Read : ఫ్లైదుబాయ్ విమానం కూల్చే కుట్ర వెనుక ఇరాన్ హస్తం..?
దీంతో కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తెచ్చే అవకాశం లేక వైసీపీ చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఈ పొలిటికల్ వాక్యూమ్ రాజకీయ శూన్యత వల్లనే ఈడీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పక్కా ఆధారాలతో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారని వైసీపీ సీనియర్ నేతలు భయపడుతున్నారు. ఒకవేళ అక్టోబర్ 14న జరిగే విచారణలో ఈ రూ.40 కోట్ల సుపారీ నిధుల మూలాలు ఏవైనా తాడేపల్లి వైపు చూపిస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదనే భయం పార్టీ అధినాయకత్వాన్ని వెంటాడుతోంది. ఢిల్లీలో రక్షణ కవచం లేకపోవడం, ఇటు ఈడీ స్పీడ్ పెంచడంతో మున్ముందు ఏం జరుగుతుందోననే టెన్షన్ ఇప్పుడు వైసీపీ టాప్ లీడర్‌షిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

