Wednesday, August 5, 2026 02:11 AM
Wednesday, August 5, 2026 02:11 AM

రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్‌లో నాగార్జున?

మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద ఇప్పుడు హాలీవుడ్ సైతం కన్నేసింది. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి క్రేజ్ సరిహద్దులు దాటింది. ఆస్కార్ జెండా మీద మన చిత్ర పరిశ్రమ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడు. గోల్డెన్ గ్లోబ్ వేదికపైనా మన సినిమాల గురించి చెప్పుకునేలా చేశాడు. అలాంటి రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద వరల్డ్ మీడియా సైతం కన్నేసింది. ఇక ఇండియాలో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యే విజయేంద్ర ప్రసాద్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు. కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు జర్మనీ నుంచి ల్యాండ్ అయిన తరువాత సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇంతలోపే ఇతర క్యాస్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున కూడా ఓ పాత్రలో కనిపిస్తాడని చక్కర్లు కొడుతున్నాయి.

కింగ్ నాగ్‌కి రాజమౌళి ఫ్యామిలీకి మంచి సంబంధాలే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. రాజన్న సినిమా టైంలో ఓ యాక్షన్ బ్లాక్‌కు రాజమౌళి సైతం డైరెక్షన్ చేశాడు. ఇక నాగార్జున అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాలో మంచి రోల్‌ను చేశాడు. అందుకే నాగార్జున అయితే ఆ పాత్రకు అటు నార్త్, ఇటు సౌత్‌లో క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారట.

చూస్తుంటే రాజమౌళి ప్రాజెక్ట్‌లో అన్ని భాషలకు చెందిన స్టార్‌లు కనిపించేలా ఉన్నారు. సౌత్ నార్త్ బాలీవుడ్ టాలీవుడ్ అన్న తేడా లేకుండా అందరినీ ఈ ప్రాజెక్టులోకి తీసుకునేలా ఉన్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రాన్ని రాజమౌళి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తరువాత చాలా గ్యాప్, టైం తీసుకుని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను రెడీ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్