Thursday, October 1, 2026 06:35 PM
Thursday, October 1, 2026 06:35 PM

ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. అసలు ఎన్ని సీట్లు పెరుగుతాయి? ఏ ప్రాంతానికి ఎన్ని దక్కుతాయి? ఏ నియోజకవర్గాల సరిహద్దులు మారతాయి? మహిళా రిజర్వేషన్ల ప్రభావం ఎంత ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 నియోజకవర్గాలే కొనసాగాయి. అయితే భవిష్యత్తులో పునర్విభజన జరిగితే ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై దాని ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది.

Also Read : నారా లోకేష్ ధైర్యానికి ఫిదా అయిన రాజ్‌దీప్ సర్దేశాయ్..!

పునర్విభజనపై చర్చ మొదలైన వెంటనే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరిగి 261కి చేరుతాయనే లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఖ్య తుది నిర్ణయం కాదనే మాట కూడా వినిపిస్తోంది. 2026లో కేంద్ర స్థాయిలో పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు, చర్చల్లో లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల స్థానాల పెంపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. పీఆర్ఎస్ విశ్లేషణలో 2011 జనాభాను ఆధారంగా తీసుకుని 50 శాతం పెంపు నమూనాను పరిశీలించగా.. ఏపీకి ప్రస్తుత 25 లోక్‌సభ స్థానాల నుంచి 36 నుంచి 38 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది అసెంబ్లీ నియోజకవర్గాల తుది కేటాయింపునకు సమానమైన లెక్క కాదంటున్నారు. అంటే.. 261 అనే సంఖ్య ప్రస్తుతం ఒక చర్చలో ఉన్న లెక్క మాత్రమే. తుది సీట్ల సంఖ్య పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖరారు కాదు.

పునర్విభజన జరిగితే కేవలం సీట్ల సంఖ్య మాత్రమే మారదు. నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు కూడా మారే అవకాశం ఉంటుంది. కొన్ని మండలాలు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. కొత్త ప్రాంతాలు కూడా కలుస్తాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది ఎన్నాళ్ల నుంచో టికెట్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు. ముఖ్యంగా యువ నేతలు, స్థానికంగా బలమైన నాయకులు, కొత్త రాజకీయ ముఖాలు తెర పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తున్న నేతల రాజకీయ లెక్కలు కూడా మారవచ్చు. ఒక నాయకుడికి బలంగా ఉన్న ప్రాంతం కొత్త నియోజకవర్గంలోకి వెళ్లిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మరోవైపు కొత్తగా కలిసే ప్రాంతంలో మరో నేతకు బలమైన ఓటు బ్యాంకు ఉంటే సమీకరణం ఎలా మారుతుంది? అన్నది ఆసక్తికరంగా మారనుంది.

Also Read : ఆ పిల్లాడి బాధ్యత నాది.. లోకేష్ కీలక ప్రకటన..!

కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం పోటీ మరింత పెరగడం ఖాయం. ఇప్పటివరకు ఒకే నియోజక వర్గాన్ని ఆశిస్తున్న పలువురు నేతలకు కొత్త సీట్లు అవకాశాలు కల్పించవచ్చు. అయితే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం ఇది కొత్త సవాలుగా మారవచ్చు. ప్రస్తుత నియోజకవర్గం సరిహద్దులు మారితే ఇప్పటివరకు తమకు బలంగా ఉన్న ప్రాంతాలన్నీ అదే నియోజకవర్గంలో ఉంటాయన్న హామీ ఉండదు. కొత్తగా చేరే ప్రాంతాల్లో పార్టీ బలం, వ్యక్తిగత పరిచయాలు, స్థానిక నాయకత్వం వంటి అంశాలను మళ్లీ నిర్మించుకోవాల్సి రావచ్చు.

పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ అంశం కూడా అత్యంత కీలకంగా మారనుంది. 2023లో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లకు మార్గం ఏర్పడింది. ఈ రిజర్వేషన్ అమలుకు పునర్విభజన ప్రక్రియతో సంబంధం ఉన్నందున.. నియోజకవర్గాల పునర్నిర్మాణంతో పాటు మహిళా రిజర్వేషన్ కూడా రాజకీయ చర్చలో ప్రధాన అంశంగా మారింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 22. అంటే మొత్తం 175 స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 13 శాతం మాత్రమే. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే.. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి? ఎన్ని స్థానాలు రిజర్వ్ అవుతాయి? అనేది తుది పునర్విభజన, రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది.

ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో కూడా కుల, ప్రాంత, వ్యక్తిగత రాజకీయ ప్రభావాలు కీలకంగా ఉన్నాయి. పునర్విభజనలో సరిహద్దులు మారితే ఈ సమీకరణాల్లోనూ మార్పులు రావచ్చు. ఒక నాయకుడి బలమైన మండలం వేరే నియోజకవర్గంలోకి వెళ్లడం.. మరో నాయకుడికి అనుకూలమైన ప్రాంతం కొత్తగా చేరడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ బలాబలాలను మళ్లీ అంచనా వేయాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే పునర్విభజన చర్చ మొదలైనప్పటి నుంచే పార్టీల్లోనూ, ఆశావహుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

ఏపీ స్థానిక ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోన్న స్థానిక సంస్థల...

పోల్స్