దుబాయ్ నుండి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వెళ్తున్న ఒక ప్రయాణికుల విమానంలో ఒక్కసారిగా హైజాక్ అలర్ట్ సిగ్నల్ రావడంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి సుమారు 180 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం.. సౌదీ అరేబియా ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండగా ఈ పరిస్థితి తలెత్తింది. విమానం నుండి అంతర్జాతీయ అత్యవసర కోడ్ ‘Squawk 7700’, ఆ తర్వాత హైజాక్ లేదా అక్రమ చొరబాట్లను సూచించే ‘Squawk 7500’ సిగ్నల్స్ రావడంతో ఇజ్రాయెల్ రక్షణ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
Also Read : వాహనదారులకు సుప్రీం షాక్.. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే..?
శత్రువులు ఎవరైనా విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారేమో అన్న అనుమానంతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వెంటనే రెండు యుద్ధ విమానాలను రంగంలోకి దించి గాల్లోనే కాపలాగా పంపింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, రక్షణ మంత్రి కలిసి అత్యున్నత అత్యవసర సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Also Read : ఏపీ మద్యం స్కామ్‌లో బిగ్ ట్విస్ట్..!
విమానంతో కాసేపు కమ్యూనికేషన్ కూడా తెగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. అయితే, విమానం సౌదీలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాతే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొదట్లో ఇదొక ఉగ్రవాద చర్య లేదా హైజాక్ అనుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ భద్రతా సంస్థల ప్రాథమిక విచారణలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. విమానంలో ఎలాంటి భద్రతా ముప్పు లేదా ఉగ్రవాదుల దాడి జరగలేదని ఇజ్రాయెల్ పీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లోని ఇద్దరు పైలట్ల మధ్య తీవ్రమైన వాగ్వాదం, గొడవ జరిగిందని, ఆ ఘర్షణ తాలూకు ఆవేశంలోనే పొరపాటున హైజాక్ సూచించే ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్ యాక్టివేట్ అయిపోయిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

