Monday, September 21, 2026 08:05 PM
Monday, September 21, 2026 08:05 PM

అక్కడ హిట్.. కానీ.. ఇక్కడ మాత్రం..!

సినిమా.. బాగుంటే ఒకటికి పది సార్లు చూస్తారు.. పది మందికి చెప్తారు.. అదే సినిమా బాగలేకపోతే.. వద్దని ఖరాఖండిగా చెప్పేస్తారు. అయితే.. కొన్ని సినిమాల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. థియేటర్‌లో సరిగ్గా ఆడకపోయినా.. ప్రస్తుతం ఓటీటీలో మాత్రం బాగా చూసేస్తున్నారు. ఇలాంటి సినిమాలకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా ఇప్పటికీ టీవీలో వస్తూనే ఉంది. ఇక సత్యదేవ్ హీరోగా వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమా థియేటర్‌లో సరిగ్గా ఆడలేదు కానీ.. యూట్యూబ్, ఓటీటీలో మాత్రం లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నిర్మాతకు డబ్బులు రాకపోయినా.. ఓటీటీ సంస్థకు మాత్రం బాగానే గిట్టుబాటు అయ్యింది.

Also Read : టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న రవి ప్రకాష్..?

కానీ థియేటర్‌లో సూపర్ డూపర్ హిట్ కొట్టి.. నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ప్లాప్ టాక్ తెచ్చుకోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే ఇరుముడి సినిమా. రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమా ఏకంగా రూ.200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. రవితేజ కెరీర్‌‍లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక థియేటర్ల వద్ద సినిమా వేయాలని ఆందోళన కూడా చేశారు. చాలా ఏళ్ల తర్వాత బండ్లు కట్టుకుని మరీ ఈ సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చారు. ఇక థియేటర్‌లలో సినిమా చూసిన వాళ్లంతా భావోద్వేగానికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా.

సినిమా థియేటర్‌లో చూసేసిన చాలా మంది ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురు చూశారు. సినిమా నెల రోజుల దాటిన వెంటనే ఇరుముడి సినిమాను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసేసింది. ఇక అంతే.. తొలిరోజు టాప్‌లో ట్రెండ్. కానీ ఇక్కడే అసలు విషయం మొదలైంది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నుంచి సినిమాపై నెగిటివ్ టాక్ బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇదేం సినిమా రా బాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. చివరికి దర్శకుడు శివ నిర్వాణతో పాటు హీరో రవితేజను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సినిమాలో ఇన్ని మైనస్‌లు ఉంటే.. ఎలా హిట్ చేశారంటూ చేస్తున్న కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఈ సినిమా పైన రకరకాల సందేహాలు ఉన్నవారే థియేటర్‌కి వెళ్ళలేదు.. తప్ప మిగతా అందరూ థియేటర్‌లో చూసిన వారే, మెచ్చుకున్న వారే. సినిమా అనే కళారూపం మొదటి నుంచి రకరకాల విమర్శలను ఎదుర్కుంటూనే ఉంది. సినిమా అంటే అన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. ఇరుముడి పూర్తిగా యాక్షన్ సినిమా కాదు. కాలక్షేపం కాదు.. సరదాగా నవ్వుకోవటం లేదు. కేవలం అంతర్లీనంగా ఎలాంటి సందేసం ఉందని అని మాత్రమే చూడాలనిపించే సందేశాత్మక సినిమా. కానీ.. ఇరుముడి విషయంలో మాత్రం ఎక్కడ లేని రంధ్రాన్వేషణ చేస్తున్నారు కొందరు సినీ అభిమాన విశ్లేషకులు.

కాసేపు కాలక్షేపం కోసం వచ్చి సేద తీరేటట్లు కాకుండా, మన చుట్టూ ఉన్న సమస్యలనే ఎత్తి కొట్టినట్టు చూపిస్తూ, వ్యవస్థను తూర్పారబట్టడమే పనిగా పెట్టుకుని తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటిదే శివ నిర్వాణ ఎంచుకున్న పద్ధతి. సినిమా సక్సెస్ అయ్యింది. కథకు, కథనానికి కూడా థియేటర్‌కి వెళ్ళి చూసిన ప్రేక్షకులు.. ఇలాంటి వారు మన చుట్టూ ఉన్నారని సులభంగా కనెక్ట్ అయ్యారు. సినిమాను అంత వరకే చూడాలి. ఇక్కడ మరో అంశం.. సినిమా పేరు. ఇరుముడి అనే శీర్షిక చూడగానే అది దేవుడి సినిమా అనుకున్నారు. కానీ అంతర్లీనంగా తండ్రీ కూతుళ్ల బంధాన్ని ఇరుముడిగా చూపించాడు. దాన్ని అలాగే తీసుకోవాలి.

Also Read : నాతో వస్తావా.. నీకు ఫేవర్ చేస్తా.. !

కూతురు ఒక్కసారి దీనంగా అడగ్గానే తాగుడు మానేసిన నిశ్చితమైన, కచ్చితమైన మనస్తత్వాన్ని ఎందుకు మెచ్చుకోకూడదు..? అదొక్క సందర్భం, సందేశం చాలదా సినిమా మొత్తాన్ని మెచ్చుకోవడానికి..? మిగతా అన్ని సందర్భాలూ, సన్నివేశాలూ కూడా మన చుట్టూ ఎప్పుడో అప్పుడు జరిగినవే జరుగుతున్నవే. కాబట్టి ఊరికే భుజాలు తడుముకోవడం మానేసి, ఉన్న సినిమాను ఉన్నట్టుగా చూడాలి. పుష్ప సినిమా చూసి ఎర్రచందనం స్మగ్లింగ్ ప్లాన్ చేసి దొరికిపోయినా తప్పులేదు. ఆ సినిమాకు, ఆ హీరోకి జాతీయ అవార్డు ఇచ్చినా తప్పులేదు. కాని ఈ సినిమాను ఇప్పుడు చూసి వంకలు పెట్టేవారిని చూస్తూంటేనే.. ఇప్పుడు ఏమాత్రం అర్థం కావటం లేదు. ఇంకా చెప్పాలంటే జాలేస్తోంది.

సినిమాను ఓటీటీలో చూసిన తర్వాత చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలకు నెటిజన్లే రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. కానీ విచిత్రమేమిటంటే.. ఇరుముడి సినిమా థియేటర్‌లో హిట్ అయ్యింది.. ఓటీటీలో మాత్రం ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది. ఏది ఏమైనా.. నిర్మాతకు డబ్బులు వచ్చాయి.. దర్శకుడు శివ నిర్వాణకు, హీరో రవితేజకు మంచి పేరు వచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో...

హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి...

వైసీపీ నేతలపై క్రిమినల్...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ...

ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల...

మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్...

నాతో వస్తావా.. నీకు...

అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపారం చేయాలనుకున్న...

టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ...

తెలుగు మీడియా రంగంలో అత్యంత ప్రజాదరణ...

పోల్స్