డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఛార్జీలపై కేంద్ర ఆర్థిక శాఖ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్ 15 నుండి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే, ఈ కొత్త నిబంధనల వల్ల సాధారణ ప్రజలకు లేదా కస్టమర్లకు రూపాయి కూడా అదనపు భారం పడదని ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది.
Also Read : యూపీఐ లావాదేవీలపై ఛార్జీల ఆందోళనలకు కేంద్రం చెక్..!
ఈ కొత్త నిబంధనల ప్రకారం, సాధారణ ప్రజలకు యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పంపే డబ్బుపై ఎలాంటి పరిమితులు లేకుండా ఉచిత సేవలు కొనసాగుతాయి. అదేవిధంగా, వ్యాపారులకు చేసే రూ. 2,000 లోపు చెల్లింపులపై కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవు. కేవలం రూ. 2,000 దాటిన పెద్ద వ్యాపార లావాదేవీలపై మాత్రమే 0.4% ఛార్జీ వర్తిస్తుంది, దీనిని కేవలం వ్యాపారులు మాత్రమే భరించాలి. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా కేంద్రం కొన్ని ఉదాహరణలను వివరించింది.
Also Read : సేఫ్టీలో మహీంద్రా కార్ సరికొత్త రికార్డు..!
మీరు ఒక హోటల్‌కు వెళ్లి డిన్నర్ చేశారు, అక్కడ బిల్లు రూ. 6,000 అయింది. అప్పుడు మీరు మీ మొబైల్ నుండి కరెక్ట్‌గా రూ. 6,000 మాత్రమే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తారు. దీనిపై పడే 0.4% ఛార్జీ.. అంటే రూ. 24 సదరు రెస్టారెంట్ యజమాని మాత్రమే బ్యాంక్కు చెల్లిస్తాడు, మీ దగ్గర వసూలు చేయకూడదు. మీరు ఒక షాపులో రూ. 30,000 విలువైన మొబైల్ కొని యూపీఐ ద్వారా పే చేస్తే, మీ అకౌంట్ నుండి కేవలం రూ. 30,000 మాత్రమే కట్ అవుతుంది. దానిపై వచ్చే రూ. 120 ఛార్జీని ఆ మొబైల్ అమ్మిన వ్యాపారే కట్టుకుంటాడు.
Also Read : తిరుమలలో హైటెక్ సెక్యూరిటీ..!
మీరు కారుకు రూ. 5,000 పెట్రోల్ కొట్టించినా లేదా రైల్వే టికెట్లు బుక్ చేసినా.. రూ. 2,000 దాటినందుకు గాను కేంద్రం నిర్ణయించిన ఫ్లాట్ రూ. 5 ఛార్జీని ఆ పెట్రోల్ బంక్ లేదా రైల్వే సంస్థలే భరిస్తాయి. కస్టమర్ కేవలం పెట్రోల్ బిల్లు అమౌంట్ మాత్రమే కడితే సరిపోతుంది. క్రెడిట్ కార్డుల లాగా ఈ యూపీఐ ఛార్జీల భారాన్ని కస్టమర్లపైకి నెట్టడానికి వీల్లేదని బ్యాంకులు, యూపీఐ యాప్ సంస్థలకు ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు, పేమెంట్ యాప్స్ మౌలిక సదుపాయాల విస్తరణకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను మెరుగుపరచడానికి వినియోగిస్తారు.

