దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి, ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. డిజిటల్ చెల్లింపుల నియంత్రణపై కేంద్ర ఆర్థిక శాఖ ఒక కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ బ్యాంకులకు, డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. సాధారణ వినియోగదారులు నిత్యం జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయంతో స్పష్టతనిచ్చింది.
Also Read : బ్రేకింగ్: ఏపీ మాజీ మంత్రి కన్నుమూత
ఈ తాజా నోటిఫికేషన్ ప్రకారం… రూ.2,000 వరకు జరిగే యూపీఐ పేమెంట్లతో పాటు ‘రూపే డెబిట్ కార్డు’ ద్వారా చేసే చెల్లింపులపై కూడా ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. డబ్బులు పంపించే చెల్లింపుదారుడిపై గానీ, లేదా ఆ డబ్బును స్వీకరించే వ్యక్తిపై గానీ ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను వసూలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల నిత్యం చిన్న వ్యాపారులకు, కిరాణా షాపులకు సామాన్యులు చేసే డిజిటల్ చెల్లింపులు మునుపటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగనున్నాయి.
Also Read : కేంద్రం ఒత్తిడికి దిగొచ్చిన మెటా.. ఆ కంటెంట్‌పై సంచలన నిర్ణయం..!
మరోవైపు, ఒకరి అకౌంట్ నుండి మరొకరి అకౌంట్‌కు వ్యక్తిగతంగా డబ్బులు పంపుకునే పీ-టు-పీ యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం నిర్ధారించింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కీలక ప్రకటనతో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు బ్రేక్ పడటమే కాకుండా, కోట్ల మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

