కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు ఇప్పుడు వైసీపీ రాజకీయ కుట్రలకు బలైపోతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడేమో ఘనంగా సత్కరించి, రివార్డులు, నజరానాలు ప్రకటించిన జగన్‌మోహన్ రెడ్డే..ఇప్పుడు వారి సర్టిఫికెట్లు నకిలీవంటూ ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవార్డులు ఇచ్చి, నేడు అదే క్రీడాకారులపై ఫేక్ ముద్ర వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also read : రేవంత్ ప్లాన్.. బీఆర్ఎస్ షాక్..!
వైసీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఎంతోమంది క్రీడాకారులను నాటి మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సత్కరించారు. అప్పట్లో లక్షల రూపాయల నగదు బహుమతులు ఇచ్చిన జీవోలు ఇప్పటికీ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. మరి అప్పుడు నిజమన్న ప్రతిభ.. ఇప్పుడు ఎలా నకిలీ అవుతుంది..? వర్సిటీలకు ప్రాతినిధ్యం వహించి, జాతీయ పోటీల్లో సత్తా చాటిన సాఫ్ట్‌బాల్, ఖోఖో, హ్యాండ్‌బాల్, వాలీబాల్ క్రీడాకారుల విజయాలపై అప్పట్లో అధికారిక పత్రికల్లోనూ ప్రముఖంగా ప్రశంసల కథనాలు వచ్చాయి. టెట్‌లో మంచి మార్కులు సాధించి మెరిట్‌తో ఉద్యోగాలు దక్కించుకున్న ఈ క్రీడాకారులను ఇప్పుడు రాజకీయంగా టార్గెట్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపాను.. సాధిక్ ఖాన్ సంచలన నిజాలు..!
సాఫ్ట్‌బాల్ విజేత శివాజీనాయక్.. జాతీయస్థాయిలో 40కి పైగా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. అప్పటి మంత్రి రోజా చేతులమీదుగా అవార్డు కూడా పొందారు. జగన్ ప్రభుత్వం రూ.3లక్షల నగదు బహుమతి ఇచ్చింది. వైసీపీ ఇచ్చిన జీవో, అవార్డులు ఇప్పుడు నకిలీవా.! అంటూ TDP నేతలు మండిపడుతున్నారు. ఇక YSR కడప జిల్లాకు చెందిన ఖోఖో క్రీడాకారుడు రామ్మోహన్‌ను నాటి సీఎం జగన్ సత్కరించి అభినందించారు. అతడిని కూడా ఫేక్ అని నిందించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం.
హ్యాండ్‌బాల్ ప్లేయర్ వీరాంజనేయులు.. యోగి వేమన విశ్వవిద్యాలయం జట్టు కెప్టెన్‌గా, కాలికట్ పోటీల్లో ప్రతిభ చూపిన విజయాలపై గతంలో సాక్షి పత్రికలోనే ప్రశంసల వార్తలు వచ్చాయి. నాగరాణి (వాలీబాల్), వాణి (బాల్ బ్యాడ్మింటన్), కావేరి (ఖోఖో).. వీరంతా శ్రీ వేంకటేశ్వర వర్సిటీ, యోగివేమన వర్సిటీలకు ప్రాతినిధ్యం వహించి, టెట్‌లో 90కి పైగా మార్కులు సాధించి ఉద్యోగాలు పొందారు. వీరి కష్టాన్ని నకిలీ అని బ్రాండింగ్ చేయడం ఎంతవరకు న్యాయం.
Also read : ఉత్తరాంధ్రలో వైసీపీ వైట్ వాష్ ఖాయం
ఐతే, గ్రూప్-1 అక్రమాలు, ఇతర పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే DSC స్పోర్ట్స్ కోటా అంశాలను వైసీపీ నేతలు వివాదాస్పదం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల కుట్రల వల్ల నిరుద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభినందించి, ఇవాళ అదే ప్రతిభను ఫేక్ అంటూ ప్రశ్నిస్తుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం తనను బలిపెట్టడం సరికాదని వైసీపీ నేతలకు నిరుద్యోగులు హితవు పలుకుతున్నారు.

